Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్ విహార్ ఆస్పత్రిలోని బేబీ కేర్ సెంటర్లో చోటుచేసుకుంది.
Slums Caught Fire Due To Cylinder Blast : ఢిల్లీ -హర్యానా బోర్డర్ లోని గురుగ్రామ్‌లోని ఘసౌలా గ్రామంలోని మురికివాడలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి 200 ఇళ్లు దగ్దమయ్యాయి. ఆ వివరాలు
Delhi fire accident: దేశ రాజధాని న్యూఢిల్లీలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు
Delhi Fire Accident Updates: ఢిల్లీలోని ముండ్క మెట్రో స్టేషన్‌కి సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 26 కి చేరింది. మరో 12 మందికి తీవ్రంగా గాయాలైనట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఇప్పటివరకు 26 మంది మృతదేహాలు వెలికి తీశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోదాములో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామునే ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఢిల్లీలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా వెంట వెంట మూడు అగ్ని ప్రమాదాలు జరగడం ఢిల్లీ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండి ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో అంటుకున్న మంటలు మొత్తం భవనానికి వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.