Jammu and Kashmir Accident: లోయలో పడిన బస్సు.. 8 మంది దుర్మరణం

Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 02:08 PM IST
  • జమ్మూకశ్మీర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • లోయలో పడిన మినీ బస్సు
  • ఎనిమిది మృతి, పలువురికి గాయాలు
Jammu and Kashmir Accident: లోయలో పడిన బస్సు.. 8 మంది దుర్మరణం

Jammu and Kashmir Accident: జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం  తెల్లవారుజామున ఓ మినీబస్సు(Mini Bus) అదుపు తప్పి లోయ(gorge)లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు థాత్రి(Thathri) నుంచి దోడా(Doda )కు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది.

ప్రమాదంపై కేంద్రమంత్రి ఆరా 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దోడా అదరపు ఎస్పీ వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించారు. వారితో పాటు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అతి కష్టం మీద సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇంకా సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్(Union Minister Dr Jitendra Singh) వెంటనే స్పందించారు. DC దోడా వికాస్ శర్మ (D.C.Doda Vikas Sharma)తో మంత్రి ప్రమాదం గురించి మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సనందించాలని ఆదేశించారు. ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు.

Also read: Man Donates Gold : భార్య చివరి కోరిక కోసం 17 లక్షల బంగారాన్ని ఇచ్చేశాడు

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News