Man Donates Gold : భార్య చివరి కోరిక కోసం 17 లక్షల బంగారాన్ని ఇచ్చేశాడు

Man Donates Rs 17 Lakh Gold: ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 17 లక్షల విలువ చేసే బంగారాన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 05:04 PM IST
  • 17 కేజీల బంగారన్ని విరాళంగా ఇచ్చిన వ్యక్తి
  • భార్య రష్మి ప్రభ కోరిక మేరకు అలా చేసిన భర్త
Man Donates Gold : భార్య చివరి కోరిక కోసం 17 లక్షల బంగారాన్ని ఇచ్చేశాడు

Madhya Pradesh: Man Donates Rs 17 Lakh Gold Jewellery at Mahakaleshwar Temple in Ujjain to Fulfill Wife's Last Wish: చాలా మంది వాళ్లకు ఇష్టమైన వాళ్ల కోరికలను తీర్చడానికి ఎన్నో చేస్తుంటారు. కొందరు వాళ్లకు నచ్చిన వారి చివరి కోరికలు ఎలాగైనా తీర్చేందుకు ఏదైనా చేస్తుంటారు. అలా ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 17 లక్షల విలువ చేసే బంగారాన్ని(17 Lakh Gold) అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. జార్ఖండ్‌లోని బొకారో (Bokaro) నివాసి సంజీవ్ కుమార్, రష్మి ప్రభ భార్యాభర్తలు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో (12 jyotirlingas) ఒకటైన మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్‌ దేవాలయానికి (Mahakaleshwar Temple in Ujjain) రష్మి ప్రభ నిత్యం వెళ్లేవారు. 

Also Read : Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రష్మి ప్రభ (Rashmi Prabha) ఇటీవలే మరణించింది. అయితే చనిపోయే ముందు ఆమె తన చివరి కోరికగా భర్త సంజవీ కుమార్‌కు (Sanjeev Kumar) తెలిపింది. అమ్మవారికి తన నగలను సమర్పించాలని కోరింది.

భార్య చివరి కోరికను తీర్చేందుకు సంజీవ్ కుమార్ తన భార్య ఆభరణాలు, 310 గ్రాముల (310 grams) బరువున్న బంగారు (Gold) నెక్లెస్‌లు, గాజులు, చెవిపోగులు సహా సుమారు రూ. 17 లక్షల (17 Lakh) విలువైన ఆభరణాలనుఅమ్మవారికి విరాళంగా ఇచ్చాడు.

Also Read : YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల పాద యాత్రలో పాల్గొన్న ప్రముఖ యాంకర్ శ్యామల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News