Success story: రాళ్లను పగులగొట్టే రూ. 10 దినసరి కూలీ.. నేడు యూపీఎస్సీ క్రాకర్..

UPSC Cracker Inspiring Journey: కష్టపడితే కాదేదీ అనర్హం.. అనే నానుడి పర్ఫెక్ట్‌ గా సరిపోతుంది ఈ యూపీఎస్సీ క్రాకర్‌కి. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్విక్ సర్వీస్ కమిషన్ (UPSC) యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ, కొంతమంది మాత్రమే ఈ పరీక్షల్లో నెగ్గి తమ కలలను సాకారం చేసుకుంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 21, 2024, 03:47 PM IST
Success story: రాళ్లను పగులగొట్టే రూ. 10 దినసరి కూలీ.. నేడు యూపీఎస్సీ క్రాకర్..

UPSC Cracker Inspiring Journey: కష్టపడితే కాదేదీ అనర్హం.. అనే నానుడి పర్ఫెక్ట్‌ గా సరిపోతుంది ఈ యూపీఎస్సీ క్రాకర్‌కి. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్విక్ సర్వీస్ కమిషన్ (UPSC) యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ, కొంతమంది మాత్రమే ఈ పరీక్షల్లో నెగ్గి తమ కలలను సాకారం చేసుకుంటారు. ఇటీవలి 12th ఫెయిల్ సినిమా కూడా దీని ఆధారంగా తీసిందే. అయితే, మనం ఈరోజు ఓ వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. అతడు కూడా యూపీఎస్సీ 2022 క్రాక్ చేశాడు. కానీ, ఇంతమందిలో ఈయనే ఎందుకు ప్రత్యేకం అనుకుంటున్నారా? అవును.. ప్రత్యేకమే అదేంటో తెలుసుకుందాం..

ఈ ప్రత్యేకమైన వ్యక్తి రాజస్థాన్ లోని మారుమూల గ్రామమైన బాపీకి చెందిన రామ్ భజన్. ఆయన రోజువారీ కూలీ. రామ్ భజన్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కొవిడ్ సమయంలో మరణించారు. మొన్నటి కటిక పేదరికంలో జీవనం సాగించిన ఈ యువకుడు యూపీఎస్సీని క్రాక్ చేశాడు. 2022 యూపీఎస్సీలో అతడు 667 వ ర్యాంక్ సాధించాడు. నిజంగా ఇతని ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం.

ఇదీ చదవండి: ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ విడుదల.. రూ. 1,40,000 జీతంతో ఉద్యోగాలు..  

దైనిక్ భాస్కర్ కు రామ్ భజన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో  చెప్పారు. తను కూడా వాళ్ల అమ్మతో రోజువారీ కూలీ అయిన రాళ్లు కొట్టి జీవనం సాగించేవాడట.. తన తల్లి ప్రతిరోజూ రాళ్ల తీసుకువస్తే వారి పనిలో భాగంగా భజన్ కొన్ని గంటలపాటు ఆ రాళ్లను పగళగొట్టే పనిచేసేవాడు.ఇలా ప్రతిరోజు 25 కార్టన్ల రాళ్లను పగుళగొడితే రూ. 5 నుంచి 10 వచ్చేవట. అది ఒక్కరికి కూడా సరిపోదు. అయితే, తన తండ్రి మేకల పెంపకం, వాటి పాలు విక్రయించడం వంటి వ్యాపారం చేసేవాడు. వీరి జీవనం ఇలానే సాగేది. కానీ, కొవిడ్ మహమ్మారి సమయంలో భజన్ తండ్రి ఉబ్బసంతో మరణించాడు. ఈ మరణంతో మరింత పేదరికంలోకి వీరి కుటుంబం కొట్టుమిట్టాడింది. ఎన్ని అడ్డుంకులు వచ్చినా రామ్ భజన్ కష్టపడి చదివి, ఢిల్లీ పోలీస్ లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు.

ఇదీ చదవండి:  యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీక్? రిక్రూట్‌మెంట్ బోర్డు ఏం చెప్పిందంటే..

అయితే, అతని చిరకాల కలను నేర్చుకోవాలని రామ్ భజన్ ఒకవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూనే మళ్లీ చదవడం ప్రారంభించాడు. ఇలా యూపీఎస్సీ 2022 లో ఐఏఎస్ పరీక్షలో పాసై తన కలను సాకారం చేసుకున్నాడు. భజన్ 8 సార్లు ప్రయత్నాలు చేసి చివరగా యూపీఎస్సీ క్రాకర్ జాబితాలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News