AAI Recruitment 2024: ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ విడుదల.. రూ. 1,40,000 జీతంతో ఉద్యోగాలు..

AAI Recruitment 2024: ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ 2024 ఆధారంగా అభ్యర్థుల ఎంపికలు జరగనున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 2024 ఏప్రిల్ 2 నుంచి మే 1 వరకు స్వీకరించనున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 21, 2024, 10:30 AM IST
AAI Recruitment 2024: ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ విడుదల.. రూ. 1,40,000 జీతంతో ఉద్యోగాలు..

AAI Recruitment 2024: ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ 2024 ఆధారంగా అభ్యర్థుల ఎంపికలు జరగనున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 2024 ఏప్రిల్ 2 నుంచి మే 1 వరకు స్వీకరించనున్నారు.

ఎయిర్ పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా మంగళవారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. గేట్ స్కోర్ 2024 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ లో వివరాలు క్షుణ్నంగా చదివి అప్లై చేసుకోవాలి.

ఇదీ చదవండి: నన్ను ఖలీస్థానీ అంటారా..?.. ఆవేశంతో ఊగిపోయిన సిక్కు ఐపీఎస్ అధికారి.. వైరల్ వీడియో..

AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 అప్లై చేసుకునే విధానం..
1. ఎయిర్ పోర్ట్‌ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ aai.aero లో నేరుగా అప్లై చేసుకోవచ్చు.
2. హోం పేజీలోAAI    రిక్రూట్మెంట్ 2024 పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ లాగిన్ వివరాలు నమోదు చేయాలి. చివరగా సబ్మిట్ బట్టన్ నొక్కాలి.
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ అప్లికేషన్లో నమోదుచేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు రుసుము చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ కొట్టి కన్ఫార్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.

ఇదీ చదవండి: సమరానికి సై.. మార్చి  9 తర్వాత ఏ క్షణంలోనైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

490 పోస్టులకు రిక్రూట్మెంట్ చర్యలు చేపట్టింది. ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్, వయస్సు ధృవీకరణ వివరాలను చదివి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News