UP Police Paper leak 2024: యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీక్? రిక్రూట్‌మెంట్ బోర్డు ఏం చెప్పిందంటే..

UP Police Recruitment: యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2024 పేపర్ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ మరియు ప్రమోషన్ బోర్డ్ ఏం చెప్పిందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 03:58 PM IST
UP Police Paper leak 2024: యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీక్? రిక్రూట్‌మెంట్ బోర్డు  ఏం చెప్పిందంటే..

UP Police Paper leak 2024: ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న పేపర్ లీక్ పుకార్లను ఉత్తరప్రదేశ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. పరీక్ష సజావుగా సాగుతోందని.. అభ్యర్థులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మెుద్దని యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ మరియు ప్రమోషన్ బోర్డ్ (UPPRPB పేర్కొంది. అంతేకాకుండా తప్పుదోవ పట్టించే సమచారాన్ని వ్యాప్తి చేయవద్దని సోషల్ మీడియా ఛానెల్‌లను, ప్రజలను కోరింది. 

యూపీలో 6,0244 కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం ఫిబ్రవరి 17 మరియు 18 తేదీల్లో పరీక్ష జరిగింది. 2385 కేంద్రాల్లో సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు ఈ నియామక పరీక్షకు హాజరయ్యారు. శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు యుపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రచారం చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి చాలా స్క్రీన్‌షాట్‌లు కూడా షేర్ చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీకి సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలని బోర్డు పేర్కొంది. మరోవైపు పేపర్ లీక్, పరీక్షల్లో మోసాలకు పాల్పడిన 287 మందిని అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రాతపరీక్ష పరీక్షలు మార్చి నెల చివర్లో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Popular CM: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం.. యోగీ ఆదిత్యనాథ్ రెండో స్థానం.. మొదటి స్థానంలో ఎవరంటే..?

Also Read: West Bengal: అక్బర్, సీతా.. సింహాలకు వివాదస్పదంగా పేర్లు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీహెచ్ పీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News