ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కారులోనే సజీవ దహనం చేసిన దుండగులు..!

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ కుమార్‌ను ఇటీవలి కాలంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

Updated: Oct 11, 2018, 06:15 PM IST
ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కారులోనే సజీవ దహనం చేసిన దుండగులు..!
Representational image/Pixabay

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ కుమార్‌ను ఇటీవలి కాలంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఎట్టకేలకు దుండగులను పట్టుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ సదరు ఆప్ నేతను టార్గెట్ చేసిన కొందరు వ్యక్తులు తనతో పరిచయం పెంచుకున్నారు. పలుమార్లు తాము నిర్వహించే పార్టీలకు ఆహ్వానించడంతో పాటు.. నవీన్ కుమార్ నిర్వహించే గే పార్టీలకు కూడా హాజరయ్యారు.

కొన్ని రోజులు వీరందరూ కలిసి రిషికేష్ ప్రాంతానికి ట్రిప్ నిమిత్తం వెళ్లారు. అదే ట్రిప్‌లో వారు నవీన్‌‌ను ప్రేరేపించి కొన్ని అశ్లీలకరమైన వీడియోలు తీశారు. తర్వాత సదరు వ్యక్తులు నవీన్ కుటుంబీకులకు ఆ వీడియోలను బహిర్గతం చేస్తామని భయపించడంతో ఆయన హతాశుడయ్యాడు. తర్వాత వారితో సమస్యను పరిష్కరించుకొనేందుకు.. ఈ క్రమంలో కొంత డబ్బును అందించేందుకు ఆయన వారు నిర్వహించిన ఓ ప్రైవేటు పార్టీకి వెళ్లారు.

అదే పార్టీలో నిద్రమాత్రల మిశ్రమాన్ని కలిపిన హల్వాను నవీన్‌తో తినిపించిన దుండగులు.. ఆయన స్పృహ కోల్పోయాక తను తెచ్చిన డబ్బును దోచుకొని.. ఆ తర్వాత ఆయనను కారులో కూర్చోబెట్టి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆయనను కారులోనే పడుకోబెట్టి.. వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. లోని - బోప్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి మరణవార్త వెలుగులోకి వచ్చాక.. పలు అనుమానాలను పేర్కొంటూ నవీన్ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషనులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవీన్ కాల్ డేటాతో పాటు ఆయన వ్యక్తిగత వివరాలు సేకరించిన పోలీసులు ఎట్టకేలకు తమ ఎంక్వయరీలో భాగంగా నిందితులు ఎవరో తెలుసుకున్నారు. కానీ వారిలో కొందరు మాట్లాడుతూ.. నవీన్ కూడా తమ అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని.. అందుకే ఆయనను తాము హతమార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు.