ఢిల్లీ ఫలితాలను ముందుగానే.. AAP ఎమ్మెల్యే ఆసక్తికర ట్వీట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తన స్నేహితురాలు ఒకరోజు ముందుగానే ఊహించారని, అందుకు సాక్ష్యంగా ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి స్క్రీన్ షాట్ షేర్ చేశారు.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Feb 18, 2020, 11:34 AM IST
ఢిల్లీ ఫలితాలను ముందుగానే.. AAP ఎమ్మెల్యే ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్మీ (AAP) 62 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెఫ్టినెంగ్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఢిల్లీ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. అయితే ఢిల్లీ ఫలితాలపై అడ్వకేట్, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి విభిన్నంగా స్పందించారు. ఢిల్లీ ఫలితాలకు ముందే తన స్నేహితురాలు ఈ విషయాన్ని సరిగ్గా ఊహించారని ట్వీట్ చేశారు.

ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి  

‘ఫిబ్రవరి 10, 2020న చేసిన చాటింగ్ మెస్సేజ్ స్క్రీన్ షాట్‌ను నా ఫ్రెండ్ షేర్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు సాధిస్తుందని ఖచ్చితంగా అంచనా వేశారు. వాస్తవానికి కూడా ఢిల్లీ ఫలితాలలో అదే జరిగింది. భవిష్యత్తును తెలుసుకునేందుకు ఆమె ఆధ్యాత్మిక శక్తులను పొందినట్లు కనిపిస్తున్నారని’ ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి ట్వీట్‌తో పాటు ఓ చాటింగ్ చేసిన స్కీన్‌షాట్ షేర్ చేసుకున్నారు.

Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?

ట్వీట్‌లో షేర్ చేసిన ఛాటింగ్ స్క్రీన్ షాట్ పరిశీలిస్తే.. ఫిబ్రవరి 10న షహనా ముఖర్జీ తన ఫ్రెండ్‌తో ఆప్ సాధించే సీట్ల గురించి చాటింగ్ చేశారు. ఈసారి ఆప్ ఎన్ని సీట్లు సాధిస్తుందని అడిగారు. 62 సీట్లు సాధిస్తుందని భావిస్తున్నట్లు వాట్సాప్‌లో మెస్సేజ్ చేశారు. 62 సీట్లకు పైగా నెగ్గుతామని రిప్లై ఇచ్చారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వచ్చిన తర్వాత అభినందిస్తూ, సరిగ్గా చెప్పినన్ని సీట్లు మీకు ఇచ్చామని మెస్సేజ్ చేశారు.

Image Source: Twitter

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..