Aero india 2023: ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏరో ఇండియా 2023 ప్రారంభం.. థీం ఏంటో తెలుసా?

Aero india 2023 News: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏరో ఇండియా 2023 ప్రారంభమవగా దాన్ని ఎక్కడ? ఎలా? ఎప్పుడు చూడాలి అనే వివరాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 13, 2023, 06:42 PM IST
Aero india 2023: ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏరో ఇండియా 2023 ప్రారంభం.. థీం ఏంటో తెలుసా?

Aero india 2023 Updates: భారత దేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏరో ఇండియా 2023 ప్రారంభమైంది. దేశ ప్రధాని సోమవారం నాడు బెంగళూరు వెళ్లి ఈ ఏరో ఇండియా 2023ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  ఇక  ఏరో ఇండియా 2023లో భాగంగా చేస్తున్న వైమానిక విన్యాసాలతో ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. ఏరో ఇండియా 2023 బెంగుళూరులో జరుగుతోందనే విషయం అందరికీ విదితమే. ఆయితే అసలు ఈ ఏరో ఇండియా 2023 ఎందుకు జరుగుతోంది? ఏరో ఇండియా 2023ని థీమ్ ఏంటి ? అని అడిగితే అది బిలియన్ అవకాశాలకు రన్‌వే అని ప్రభుత్వం చెబుతోంది.

ఈ ఏరో ఇండియా 2023 షో ఎక్కడ జరుగుతోంది? 
ఈ ఏరో ఇండియా 2023 షో వేదిక గురించి చెప్పాలంటే అది బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతోంది. రక్షణ సామర్థ్యాలలో భారతదేశం యొక్క వృద్ధిని ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తారు.  ఈసారి ఏరో ఇండియా-2023లో 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' విజన్‌కు అనుగుణంగా స్వదేశీ పరికరాలు/సాంకేతికతను ప్రదర్శించడం అదే సమయంలో విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం మీద దృష్టి సారించింది

ఏరో ఇండియా 2023 షో ఎక్కడ చూడాలి?
ఈ ఏరో ఇండియా 2023 షో చూడాలి అంటే అవి జరుగుతున్న లైవ్ లొకేషన్‌కు వెళ్లి వీక్షించవచ్చు. అలా కాకుండా ఈ ఏరో ఇండియా 2023 షో ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్‌లో కూడా చూడవచ్చు. ఏరో ఇండియా 2023 ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. 

ఏరో ఇండియా 2023 టికెట్లు ఎక్కడ దొరుకుతాయి?
ఏరో ఇండియా షో టిక్కెట్లు మీరు ఏరో ఇండియా షో కోసం టిక్కెట్లు బుక్ చేయాలనుకుంటే, మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.aeroindia.gov.in/ కి వెళ్లితే అక్కడ మీకు టిక్కెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఏరో ఇండియా 2023 చూడాలంటే టికెట్ ధర వెయ్యి రూపాయలు, విదేశీ పౌరులకు అది 50 డాలర్లు. ఏరో ఇండియా బిజినెస్ టిక్కెట్‌లు అంటే ఫిబ్రవరి 13-15, 2023 బిజినెస్ రోజులలో మాత్రమే ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని సందర్శించగల టిక్కెట్టు రేటు 5,000 రూపాయలు కాగా విదేశీయులకు 150 డాలర్లు.

Also Read: NEET PG 2023 exam: నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయలంటున్న డాక్టర్లు.. తగ్గేదేలే అంటున్న ప్రభుత్వం!

Also REad: Kiss Day 2023: ముద్దులు పెట్టుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? తెలిస్తే ట్రై చేయకుండా ఉండలేరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News