భారత్ లో ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ !

Last Updated : Oct 24, 2017, 01:45 PM IST
భారత్ లో ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ !

ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మంగళవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం న్యూదిల్లీకి వచ్చిన ఆయన ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఆఫ్ఘన్ లో భద్రత, ఉగ్రవాదంతో సహా పలు కీలక అంశాల మీద చర్చించనున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి చర్చలు జరుపుతారు. 

ఈ సందర్భంగా మోదీ ఆఫ్ఘాన్ అధ్యక్షుడికి గౌరవ సూచకంగా విందు ఏర్పాటు చేయనున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా  అష్రాఫ్ ఘనీతో భేటీ కానున్నారు. న్యూదిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్ వద్ద జరిగే కార్యక్రమంలో ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

Trending News