పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి.. హీరోకు అభిమాని షాక్!

పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి.. హీరోకు అభిమాని షాక్!

Last Updated : May 6, 2019, 03:22 PM IST
పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి.. హీరోకు అభిమాని షాక్!

సినిమా హీరోలకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా హీరోలు ఎలా ఉంటే అలాగే ఉండాలని, వాళ్లు ఏం చేస్తే అదే చేయాలని భావించే క్రేజీ ఫ్యాన్స్ ఎంతో మంది వారినే అనుకరిస్తుంటారు. సినిమా హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండే ఉత్పత్తులకు సైతం మార్కెట్ ఎక్కువే ఉంటుంది. అందుకే వారికి కోట్ల రూపాయలు చెల్లించి మరీ తమ ఉత్తత్తులను ప్రమోట్ చేయించుకుంటుంటాయి పలు వాణిజ్య సంస్థలు. అయితే, అలా డబ్బుల కోసం వ్యాపార ఉత్పత్తుల అడ్వర్టైజ్‌మెంట్స్‌కి అంగీకరించే మందు కొంచెం ఆలోచించండి అంటున్నాడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌కి వీరాభిమాని అయిన నానక్ రామ్ అనే వ్యక్తి. 

రాజస్తాన్‌కి చెందిన నానక్ రామ్ వయస్సు 40 ఏళ్లు. అజయ్ దేవ్‌గన్‌కి వీరాభిమాని. అందుకే అజయ్ దేవ్‌గన్ ఎండార్స్ చేస్తోన్న ఓ పొగాకు ఉత్పత్తులనే నానక్ రామ్ కూడా ఇష్టంగా తిన్నాడు. తీరా చూస్తే చివరికి అదే పొగాకు ఉత్పత్తుల ద్వారా తనకు క్యాన్సర్ సోకిందని ఆలస్యంగా గుర్తించిన నానక్ రామ్.. అజయ్ దేవ్‌గన్‌కి కరపత్రాల రూపంలో ఓ బహిరంగ విజ్ఞప్తిచేస్తున్నాడు. దయచేసి క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి అంగీకరించొద్దని తాను ఉంటున్న ప్రాంతంలోనే 1000కిపైగా కరపత్రాలు పంచిపెట్టడమే కాకుండా ఎన్నో చోట వాల్ పోస్టర్స్ కూడా అంటించాడు. 

సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులనే కాకుండా మద్యపానియాలను కూడా హీరోలు ప్రమోట్ చేయకూడదని నానక్ రామ్ విజ్ఞప్తిచేస్తున్నాడు. గతంలో టీ కొట్టు నడిపించి కుటుంబాన్ని పోషించుకున్న నానక్ రామ్ ఇప్పుడు ఏ పని చేసుకునే పరిస్థితిలో లేకపోవడంతో అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతోంది.

Trending News