Chhattisgarh: మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత..

గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న చత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తుదిశ్వాస విడిచారు. రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అజిత్ జోగి మరణ వార్తను

Last Updated : May 29, 2020, 06:15 PM IST
Chhattisgarh: మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత..

హైదరాబాద్: గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న చత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి (Ajit Jogi) అజిత్ జోగి తుదిశ్వాస విడిచారు. రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అజిత్ జోగి మరణ వార్తను ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చత్తీస్ ఘఢ్ (Chhattisgarh) రాష్ట్రం కుటుంబ పెద్దను కోల్పోయిందని, తానే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒక తండ్రిని కోల్పోయారని ట్విట్టర్ లో ఆయన వ్యాఖానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అజిత్ జోగి గత వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని, మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు.

Also Read:  ( AP High Court : ఏపీ సర్కార్‌కి షాక్ ఇచ్చిన హై కోర్టు )

కాగా 2000వ సంవత్సరంలో నూతనంగా అవతరించిన చత్తీస్ ఘఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్ర సృష్టించారు. 2016లో కాంగ్రెస్ నుంచి (Congress Party) బయటకు వచ్చిన ఆయన జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘఢ్ (Janta Congress Chhattisgarh) అనే సొంత పార్టీని స్థాపించారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్ పూర్ లో జన్మించిన ఆయన భోపాల్ లోని మౌలానా అజాద్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐఏఎస్ గా భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News