Amit Shah dares Rahul Gandhi, Mamata Banerjee : దమ్ముంటే చర్చకు రండి : రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్

సీఏఏపై అవాస్తవాలు ప్రచారం చేయాలని ఎవరెంత ప్రయత్నించినా... వారి ఆటలు సాగవని.. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపి శ్రేణులు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తున్నాయని అమిత్ షా అన్నారు.

Last Updated : Jan 11, 2020, 11:40 PM IST
Amit Shah dares Rahul Gandhi, Mamata Banerjee : దమ్ముంటే చర్చకు రండి : రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship amendment act) పై ప్రతిపక్షాలు లేనిపోని అవాస్తవాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కు దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టంపై బహిరంగ చర్చకు రావాలని అమిత్ షా సవాల్ చేశారు. సీఏఏపై అవాస్తవాలు ప్రచారం చేయాలని ఎవరెంత ప్రయత్నించినా... వారి ఆటలు సాగవని.. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపి శ్రేణులు (BJP) ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తున్నాయని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించిన అమిత్ షా.. మోదీ హయాంలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించినట్టు తెలిపారు. ''అభివృద్ధిపథంలో భారత్ ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మోదీ నిరంతరం ప్రజల మధ్యే ఉంటారు కనుకే జనం ఆయన్ని నమ్ముతున్నారు'' అని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

1947 నుంచి 2014 వరకు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2014 నుంచి 2019 వరకు కేవలం ఐదేళ్లలో 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే సొంతం అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా అంత వేగంగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాత్కాలిక ఇబ్బందులను చూసి ఆవేదన చెందొద్దన్న అమిత్ షా.. కేవలం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యం కానేకాదని.. 2024 వరకు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ని తీర్చి దిద్దడమే ప్రభుత్వం ధ్యేయం అని అమిత్ షా తెలిపారు.

Trending News