న్యూ ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యునికేషన్స్ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్ కంపెనీకి డైరెక్టర్స్‌గా ఉన్న అనిల్ అంబానీ సహా ఛాయ విరాని, రైనా కరాని, మంజరి, సురేష్ రంగచార్ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియలో ఉన్న ఆర్‌కామ్ కంపెనీ రూ.30,142 కోట్ల నష్టాల్లో కూరుకుపోయినట్టు గత జులై-సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు చెబుతున్నాయి.