ESIC Recruitment 2024: ఈఎస్‌ఐసీలో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1930 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు నర్సింగ్ ఆఫీసర్లు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు అనగా మార్చి 27వ తేదీ నుంచి మొదలైంది. దరఖాస్తు చేసుకునే విధానం తెలుసుకుందాం.
UPSC ESIC Nursing Officer Recruitment 2024:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీ వారీగా ఇలా ఉన్నాయి..
అన్‌రిజర్వుడ్ -892
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ - 193
ఎస్సీ- 235
ఎస్టీ-164
ఓబీసీ-446
వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తింపు ఉంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ (అనర్స్) నర్సింగ్, రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పొంది ఉండాలి. ఇది కాకుండా మిడ్ వైఫ్ జనరల్ నర్సింగ్‌లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా చేసి ఉండాలి. 50 పడకల హస్పిటల్ లో కనీసం ఓ సంవత్సరం పాటు పని చేసి ఉండాలి.
ఇదీ చదవండి:అయోధ్య రామమందిరం వద్ద పేలుడు.. అలర్ట్ అయిన పోలీసులు..
ఈ పోస్టులకు ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు.ఇందులో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు నర్సింగ్ నర్సింగ్ మేనేజ్మెంట్, పీడియాట్రిక్ నర్సింగ్, సైకాలజీ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ భాషలో ఉంటాయి. ఈ పరీక్ష 2 గంటలపాటు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష 2024 జూలై 7 న నిర్వహించనున్నారు.
ఈ పోస్టలకు అప్లై చేసుకునే అభ్యర్థులు స్టేట్ నర్సింగ్ కౌన్సెల్ నుంచి నర్స్ లేదా మిడ్ వైఫ్‌గా రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
upsc.gov.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
హోంపేజీలో రిక్రూట్మెంట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈఎస్‌ఐ రిక్రూట్మెంట్ అప్లై లింక్ పై క్లిక్ చేసి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
డాక్యుమెంట్లను అప్లికేషన్‌తోపాటు అప్లోడ్ చేయాలి. అక్కడే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఓ కాపీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
ఇదీ చదవండి:మొబైల్ నంబర్ లేకున్నా ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
దరఖాస్తు రుసుము..
ఈఎస్‌ఐసీ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు రూ.25 చెల్లించాలి. ఎస్, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫీజును మీ దగ్గర్లోని ఎస్‌బీఐ బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే మీ డెబిట్, క్రెడిట్, యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించుకునే సదుపాయం కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి