Arvind Kejriwal: కేజ్రీవాల్‌జీ కంగ్రాట్స్: ఆప్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌లో అధికార ఆప్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఆప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అభినందించారు.

Last Updated : Feb 11, 2020, 01:28 PM IST
Arvind Kejriwal: కేజ్రీవాల్‌జీ కంగ్రాట్స్: ఆప్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభంజనం సృష్టించింది. మూడింట రెండొంతులకు పైగా సీట్లను ఆప్ సొంతం చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 56 స్థానాల్లో ఆప్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తుండగా.. బీజేపీ 14 స్థానాల్లో తమ హవా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖాతా తెరిచేలా కనిపించడం లేదు. అయితే అధికార ఆప్‌కు అఖండ విజయాన్ని అందించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆప్ సంబరాలలో పాలు పంచుకున్నారు.

ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న ఆప్ ప్రధాన కార్యాలయానికి నేటి ఉదయం నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఉదయం ట్రెండ్ చూసిన పార్టీ శ్రేణులు స్వీట్లు, మిఠాయిలు పంచుకుని సెలబ్రేషన్ మొదలుపెట్టగా.. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో ఆప్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఈ విజయాన్ని వారు ఆస్వాదిస్తున్నారు.  ఢిల్లీ ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి 

ఆప్ ముఖ్యనేతలతో ఎన్నికల్లో విజయంపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసిన విధానం, తమకు కలిసొచ్చిన అంశాలు, ప్రజలపై ప్రభావం చూపిన తీరుపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  కేజ్రీవాల్, ప్రశాంత్ కిషోర్ అప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోకు విశేషమైన స్పందన లభిస్తోంది. కాగా, పట్‌పర్ గంజ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాస్త వెనుకంజలో ఉన్నారు.

Also Read: ఢిల్లీ ప్రజలు AAPకే పట్టం కడతారు: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News