హైదరాబాద్: ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్ 15న విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి డిమాండ్ చేశారు. జామియా యూనివర్శిటీలో హింసకు సంబంధించి తాజాగా పలు దృశ్యాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసి ఈ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసులపై ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. పోలీసులపై పారదర్శక విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది అని అసదుద్దీన్ నిలదీశారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జామియా యూనివర్శిటీ కో-ఆర్డినేషన్ కమిటీ శనివారం విడుదల చేసిన వీడియోలను పరిశీలిస్తే... విశ్వవిద్యాలయం లైబ్రరీలోని రీడింగ్ హాలులో పోలీసులే విద్యార్థులపై దాడికి పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఢిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్‌కు ఒవైసి డిమాండ్