Ayushman Bharat Eligibility: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలో ప్రవేశపెట్టననున్న బడ్జెట్‌పై అందరి దృష్టి నెలకొంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద బీమా రక్షణను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. కేన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా ఆయుష్మాన్ భారత్ కింద తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
అధిక ఖర్చుతో కూడిన కేన్సర్ చికిత్సలు, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేయడానికి ఆయుష్మాన్ భారత్ బీమా ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కేంద్ర భావిస్తోంది. ఈ పెంపుతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షలకు ఆరోగ్య బీమా కవర్ కానుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారులను రెట్టింపు చేసి.. 100 కోట్లకు పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు, భవన నిర్మాణ కార్మికులు, బొగ్గుగని యేతర కార్మికులు, ఆశా కార్మికులకు ప్రయోజనాలను ఈ బీమా ప్రయోజనం వర్తింపజేస్తుంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా కవరేజ్ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షలు అందిస్తున్న విషయం తెలిసిందే.
2018 సెప్టెంబర్ నెలలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా PM-JAY ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 55 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 12 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ స్కీమ్‌కు సొంతంగా నిధులు కేటాయిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి దాదాపు 28.45 కోట్ల ఆయుష్మాన్ కార్డ్‌లు జారీ చేసినట్లు ప్రభుత్వ డేటా వెల్లడించిది. దాదాపు 9.38 కోట్ల ఆయుష్మాన్ కార్డ్‌లు 2023లోనే మంజూరు చేసింది.
ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల కవరేజీ పెంచడంతోపాటు లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు చేర్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం 2023-24 కోసం ఆయుష్మాన్ భారత్ PM-JAY కోసం కేటాయించిన బడ్జెట్ రూ.7,200 కోట్లు. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.15,000 కోట్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6 వేల కోట్లు కేటాయించగా.. తరువాత ఏడాదికి 12 శాతం పెరిగింది.
Also read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి