Baba Siddique Iftar Party 2023: దేశ వ్యాప్తంగా ఇఫ్తార్ పార్టీ వేడుకలు ఊపందుకుంటున్నాయి. ప్రతి సంవత్సరంలాగే కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్ధిక్ చేపట్టి ఇఫ్తార్ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ యూట్యూబర్లు కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ప్రస్తుతం సిద్ధిక్ ఇఫ్తార్ పార్టీ వేడుకలకు సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నెట్టింట వైరల్‌గా మారిన సన్నివేశాల్లో సునీల్ శెట్టి, ప్రీతి జింటా, అహన్ పాండే, చుంకీ పాండే, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, రష్మీ దేశాయ్, రోహిత్ సరాఫ్, అల్వీరా అగ్నిహోత్రి, అతుల్ అగ్నిహోత్రి, అబ్బాస్ మస్తాన్, పుల్కిత్ సామ్రాట్, హుమా ఖురేషి, పూజానోత్ హష్మీ, పూజానోత్ హష్మీ వంటి ప్రముఖ బాలీవుడ్ స్టార్లు ఉన్నారు.
ఇంతకీ బాబా సిద్ధిఖీ ఎవరు?:
బాబా సిద్ధిఖ్ పేరే కాకుండా జియావుద్దీన్ సిద్ధిఖీ అనే పేరుతో కూడా ప్రజాదరణ పొందాడు. బాబా సిద్ధిఖీ 1999, 2004, 2009లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేస్తున్నారు. బాబా సిద్ధిఖీకి బాలీపుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. అయితే ఆయనకు అర్షియా అనే కూమర్తె కూడా ఉంది.
Also Read: Amarnath Yatra 2023: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం, మీరు వెళ్లాలనుకుంటే ఇవి తప్పని సరి!
సల్మాన్ ఖాన్ పైనే కెమెరాల ఫోకస్:
బాబా సిద్ధిఖ్ ఇఫ్తార్ విందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో పఠానీ లుక్‌లో సల్మాన్ కనిపించడంతో కెమెరాల ఫోకస్ పడింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాబా సిద్ధిఖీ ఎప్పటి నుంచో సల్మాన్ ఖాన్‌కి మంచి సన్నిహితుడు. కాబట్టి ఈ పార్టీకి సిద్ధిఖీ పిలువగానే హాజరయ్యారని సమాచారం. ఈ పార్టీలో సల్మాన్ ఖాన్ సిద్ధిఖీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Amarnath Yatra 2023: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం, మీరు వెళ్లాలనుకుంటే ఇవి తప్పని సరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook