joshi records statement: ఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలన్న సుప్రీం కోర్టు ( Supreme Court of India ) ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు ప్రతీరోజు విచారణ జరుపుతోంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ( murli manohar joshi ) తన వాంగ్మూలాన్ని గురువారం నమోదు చేశారు. గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ వాంగ్మూలం ప్రక్రియ జరిగింది. Also read: Ram Temple: రామమందిర ముహూర్తం అశుభం: శంకరాచార్య
బీజేపీ నేత జోషి వాంగ్మూలాన్ని యూపీ లక్నోలోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే. యాదవ్ తీసుకున్నారు. అయితే.. ఈ కేసులో మరో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం నమోదు చేసే అవకాశముంది. ఇదిలాఉంటే.. ఈ కేసులో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి (Uma Bharti) కూడా స్వయంగా కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. Also read: Corona Virus: ఆ భారతీయులకు కరోనా సోకదు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 32 మంది నిందితులుగా ఉన్నారు. సీఆర్పీసీలోని 313 సెక్షన్ కింద ప్రస్తుతం ఈ నిందితుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ప్రతీరోజు జరుగుతోంది. ఆగస్టు 31లోపు విచారణ ముగించాల్సి ఉండటంతో ప్రత్యేక కోర్టు అందరి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. Also read: Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్