badlapur sexual assult case: మహారాష్ట్రలోని థానె జిల్లాలోని బద్లాపూర్ లో జరిగిన ఘోరం దేశంలో పెనుదుమారంగా మారింది. ఒక స్కూల్ లో స్వీపర్.. నర్సరీ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికలు స్కూల్ కు వెళ్లడానికి భయంతో వణికిపోయారు. దీంతో దీనిపై ఆరా తీయగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను డాక్టర్ ల దగ్గరకు తీసుకెళ్లగా లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది.
దీంతో ఒక్కసారిగా బద్లాపూర్ వ్యాప్తంగా అగ్గిరాజుకుంది. బాలికల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్ అక్షయ్ షిండే ఈ ఘతుకానికి పాల్పడినట్లు కూడా బైటపడింది. దీంతో పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన మహారాష్ట్రలో అగ్గిరాజేసిందని చెప్పుకొవచ్చు. దాదాపు.. 12 గంటల పాటు.. రైల్వే ట్రాక్ ల మీద రైళ్లను అడ్డుకుని మరీ నిరసలను తెలియజేశారు.ఈ నేపథ్యంలో తాజాగా, నిందితుడు అక్షయ్ షిండే ను తలోజా జైలు నుంచి బద్లాపూర్ కు తీసుకొని వస్తుండగా అతను పోలీసుల రివాల్వర్ లాక్కొని కాల్పులకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో సంఘటన స్థలంలోనే అక్షయ్ షిండే మరణించినట్లు తెలుస్తోంది.
పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న షిండే టాయిలెట్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 17న నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత.. స్థానికులు బద్లాపూర్ స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌లను అడ్డుకోవడంతో పాటు పాఠశాల భవనాన్ని ధ్వంసం చేశారు.
అంతేకాకుండా.. రైళ్లు, పోలీసుల మీద రాళ్లు రువ్వారు. దీంతో..టియర్ గ్యాస్, లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి 30 మందిని అరెస్టు చేయగా, 2000 మందిపై కేసు నమోదు చేశారు. నిరసనల మధ్య, భారీ భద్రతతో చుట్టబడిన ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.