Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. మే నెలలోని తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటితో పాటు మే నెల మొత్తంగా 13 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 01:03 PM IST
Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. బ్యాంకు వ్యవహారాలను పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీరు బ్యాంకు పని దినాల గురించి తెలుసుకోవాల్సిందే. మే నెల మొదటి వారంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఈ క్రమంలో మే నెల మొత్తంగా బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూతపడనున్నాయో తెలిస్తే.. సెలవు రోజుల్లో బ్యాంకులకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం 2022 మే నెలలో బ్యాంకుల సెలవులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. 

వరుసగా నాలుగు రోజులు బంద్..

RBI క్యాలెండర్ ప్రకారం మే నెలలోని మొదటి వారంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పండుగలు బట్టి సెలవులు మారే అవకాశం ఉంది. మే నెలలో 31 రోజులకు 13 రోజులు పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.  

మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా 

మే 1 : కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర రాష్ట్ర దినోత్సవం (వారాంతం).

మే 2 : మహర్షి పరశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)

మే 3 : ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)

మే 4 : ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)

మే 8 : ఆదివారం (వారాంతపు సెలవు)

మే 9 : గురు రవీంద్రనాథ్ జయంతి - (పశ్చిమ బెంగాల్, త్రిపుర)

మే 14 : రెండవ శనివారం

మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)

మే 16 : మెర్క్యురీ పౌర్ణమి

మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)

మే 24 : కాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు - సిక్కిం

మే 28 : 4వ శనివారం బ్యాంకులకు సెలవు

మే 29 : ఆదివారం (వారాంతపు సెలవు)  

Also Read: WhatsApp New Update: వాట్సాప్ కొత్త అప్డేట్.. ఒకేసారి రెండు మొబైల్స్ లో లాగిన్ అవ్వొచ్చు!

Also Read: Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News