ప్రేమలో ఉన్నంత మాత్రానా లైంగిక సంబంధానికి అంగీకరించినట్లు కాదు : కేరళ హైకోర్టు

Kerala High Court: ప్రేమ, లైంగిక సంబంధం పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ప్రేమించిన యువతి తనతో అన్నింటికీ అంగీకరించినట్లేనన్న భావన సరికాదని పేర్కొంది. ఓ బాలికపై యువకుడి అత్యాచార కేసును విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 04:09 PM IST
  • ప్రేమలో ఉన్నంత మాత్రానా అన్నింటికీ అంగీకరించినట్లు కాదు
    నిస్సహాయతను అంగీకారకంగా పరిగణించలేము
    మైనర్ బాలికపై అత్యాచార కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రేమలో ఉన్నంత మాత్రానా లైంగిక సంబంధానికి అంగీకరించినట్లు కాదు : కేరళ హైకోర్టు

Kerala High Court: ఒకరితో ప్రేమలో (Love) ఉన్నంత మాత్రానా... వారు తనతో లైంగిక సంబంధానికి అంగీకరించినట్లుగా భావించకూడదని కేరళ హైకోర్టు పేర్కొంది. అనివార్య పరిస్థితుల నడుమ వ్యక్తుల నిస్సహాయతను వారి అంగీకారంగా భావించలేమని తెలిపింది. అంగీకారానికి, లొంగుబాటుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంది. అత్యాచార కేసులో (Rape) ట్రయల్ కోర్టు తనను దోషిగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ 26 ఏళ్ల శ్యామ్ శివన్ అనే యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

శ్యామ్ శివన్ 2013లో తాను ప్రేమిస్తున్న బాలికను కర్ణాటకలోని (Karnataka) మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న నగలన్నీ అమ్మేశాడు. ఆ తర్వాత ఆమెను గోవా తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. నిజానికి అతని వెంట వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. అయితే తన వెంట రాకపోతే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను బెదిరించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాలిక అతని వెంట వెళ్లాల్సి వచ్చింది.

Also Read: కైకాల సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడిన చిరంజీవి

ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు ప్రస్తావిస్తూ... బాధిత బాలిక నిందితుడి పట్ల ప్రతిఘటించకపోవడాన్ని ఆమె అంగీకారంగా పరిగణించలేమని పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లో... మరో మార్గం లేకనే ఆమె అతనికి లొంగిపోయిందని తెలిపింది. అంతా బాలిక అంగీకారంతోనే (Rape on Minor girl) జరిగిందన్న నిందితుడి వాదనను తోసిపుచ్చింది. బాధితురాలి వయసు విషయంలో స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పోక్సో చట్టం కింద అతనిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో ఐపీసీ సెక్షన్ 366,376 (కిడ్నాప్, రేప్)ల కింద అతను శిక్షార్హుడేనని పేర్కొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News