న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సామాజిక కార్యకర్త నానాజి దేశ్ముఖ్, ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికకు కేంద్రం భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. తనకు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ... దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ''తాను దేశ ప్రజలకు చేసిన సేవ కన్నా.. వాళ్లు తనకు ఇచ్చిందే ఎక్కువ అని తాను గతంలోనూ చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను'' అని పేర్కొన్నారు.
It is with a deep sense of humility and gratitude to the people of India that I accept this great honour #BharatRatna bestowed upon me. I have always said and I repeat, that I have got more from the people of our great country than I have given to them.#CitizenMukherjee
— Pranab Mukherjee (@CitiznMukherjee) January 25, 2019
రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటి అనంతరం ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. భారతరత్న పురస్కార విజేత ప్రణబ్ ముఖర్జీకి అభినందనలు తెలిపారు. నానాజి, భూపెన్ హజారికల సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు.