పొరుగు దేశానికి మద్దుతుగా నిలిచిన అసోం

Assam Irrigation Water Dispute | ఇప్పటికే ఓ వైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్ దేశాలతో భారత్ సరిహద్దు, నీటి పంపకాల సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భూటాన్ మీదుగా వచ్చే సాగునీరు ఆగిపోగానే మరో సందేహం మొదలైంది. భూటాన్ సైతం భారత్‌ను ఇరుకున పెట్టిందా అనే అనుమానాలు తలెత్తాయి.

Last Updated : Jun 26, 2020, 02:15 PM IST
పొరుగు దేశానికి మద్దుతుగా నిలిచిన అసోం

భారత్, చైనాల(India Vs China)) మధ్య అగ్గి రాజేస్తున్న సమయంలో మరో భారత్‌తో మరో దేశానికి సంబంధలు మొదలవుతున్నాయా అనే వదంతులు వ్యాప్తించాయి. నదీ జలాలల తరలింపును అడ్డుకోవడమే అందుకు కారణమని ప్రచారం జరిగింది. వావస్తవానికి భూటాన్ నుంచి అసోం(Assam) రాష్ట్రానికి వ్యవసాయం చేసుకోవడానికి సాగునీరు వస్తుంది. ఈ నీటిని భూటాన్ ఆపలేదని అసోం అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భూటాన్ నేతలకు కాస్త ఊరట కలిగి ఉంటుంది. భారత్ VS చైనా.. పెద్దన్న అమెరికా కీలక ప్రకటన

అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ సంజయ్ కృష్ణ దీనిపై స్పందించారు. ‘అసోంకు సాగునీరు(Assam Irrigation Water) భూటాన్ కొండ ప్రాంతాల నుంచి వస్తుంది. అయితే ఏదో అనుకోని అడ్డంకి కారణంగా అసోంకు భూటాన్ నుంచి నీరు అందలేదు. మేం భూటాన్ అధికారులను సమాచారం అందించగానే వారు అప్రమత్తమై సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు నీరు బాగానే వస్తున్నాయి.  ఆ మహిళా ప్రధాని వివాహం నాలుగోసారి వాయిదా

అసోం రాష్ట్రం, భూటాన్ దేశం మధ్య ఏ వివాదం లేదు. అసోంకు వచ్చే నీరు అనుకోని అడ్డంకి కారణంగా ఆగిపోయింది. విషయం తెలియగానే భూటాన్ సమస్యను పరిస్కరించింది. కనుక భారత్, భూటాన్ దేశాల మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం కేవలం వదంతులేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని’ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ కుమార్ సంజయ్ వివరించారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News