Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. దీంతోపాటు 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

Last Updated : Nov 10, 2020, 06:22 AM IST
Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

Bihar Election Result 2020 Update: న్యూఢిల్లీ: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Bihar election results) మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే 10 గంటలకల్లా ట్రెండ్స్‌ వెలువడే అవకాశముంది. 

అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)‌ నేతృత్వంలోని ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్‌లతో కూడిన మహాఘట్‌బంధన్‌కే అవకాశముందని పేర్కొన్నాయి. దీంతోపాటు మరికొన్ని న్యూస్ ఛానెళ్లు హంగ్‌ కూడా ఏర్పడవచ్చని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ-బీజేపీ కూటమి నేత నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భవితవ్యం కూడా తేలనుంది. అయితే బీహార్ ఎవరికి దక్కనుందో తెలియాలంటే మరికొంతసేపు ఆగాల్సిందే. 

ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడే..
దీంతోపాటు దేశంలోని 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా మరికాసేపట్లో వెలువడనున్నాయి. అన్నిచోట్ల ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్నింటికంటే.. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ ఉపఎన్నికల ఫలితాలపై (madhya pradesh by election results) తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని నెలల కిందట (కాంగ్రెస్ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి ) ప్రస్తుత బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ 28 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు వాటి ఫలితాలపైనే శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. మద్యప్రదేశ్‌తోపాటు గుజరాత్‌లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1, తెలంగాణలో 1 (దుబ్బాక) ఉప ఎన్నికల ఫలితాలు కూడా మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 
 Also Read :  Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News