Viral news: రైతు ఖాతాలో రూ. 52 కోట్లు..షాకైన అధికారులు! అసలేం జరిగిందంటే...

Bihar: రెండు రోజుల కిందటి వరకు అతడో సాధారణ రైతు.  కానీ నేడు కొన్ని కోట్లకు అధిపతి.  ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్‌. దేశంలో ఏ రాష్ట్రంలో కాదు గానీ… బీహార్‌లో మాత్రం సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు గానీ.. పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 02:02 PM IST
  • రైతు పింఛన్ అకౌంట్‌లో రూ. 52 కోట్లు
  • బీహార్‌లోని ముజఫరాపూర్‌ జిల్లాలో ఘటన
  • విచారణ చేపట్టిన అధికారులు
Viral news: రైతు ఖాతాలో రూ. 52 కోట్లు..షాకైన అధికారులు! అసలేం జరిగిందంటే...

Rs 52 Crore In Bank Account: బిహార్‌(Bihar)లో వరుసగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల వచ్చిపడుతున్నాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. తాజాగా ఓ  వృద్ధుడి పింఛన్‌ ఖాతా(Pension Account)లో రూ.52 కోట్లు జమకావడంతో...అధికారులు షాక్ కు గురైయ్యారు. ఇటీవల ఇద్దరు విద్యార్థులు బ్యాంకు అకౌంట్స్‌లో రూ. 960 కోట్లు జమ అయిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థుల ఖాతాల్లో అంత మొత్తం ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి విచారణ సాగుతుండగానే.. అదే రాష్ట్రంలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం గమనర్హం.

వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని ముజఫరాపూర్‌ జిల్లా(Muzaffarpur District) కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా కొంత కాలం కిందట వృద్దాప్య పింఛను కోసం బ్యాంక్ ఖాతాను తెరిచాడు. అయితే రామ్ బహుదుర్.. తన పింఛన్ డబ్బులకు సంబంధించి అకౌంట్‌(Bank Account)ను చెక్ చేసుకోవడానికి సమీపంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లాడు. అక్కడ ఆధార్ కార్డు సమర్పించిన అతడు, వేలిముద్ర వెరిఫికేషన్‌ చేశాడు. అతని అకౌంట్‌లో రూ. 52 కోట్లు గుర్తించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆపరేటర్ షాక్‌కు గురయ్యాడు. ఇదే విషయాన్ని రామ్ బహుదుర్‌కు తెలియజేశాడు.

Also read: Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!

కొంత డబ్బు ఇప్పిస్తే బాగుంటుంది: రైతు
క్షణాల్లోనే ఈ విషయం ఆ చుట్టుపక్కల వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రాహ్ బహుదుర్(Ram Bahadur Shah) వద్దకు చేరుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి రామ్ బహుదుర్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలిసి మేము షాక్ తిన్నాం. ఇంత పెద్ద మొత్తం నా బ్యాంకు ఖాతాలో ఎలా వచ్చిందని ఆశ్చర్యమేసింది. మేము వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నా ఖాతాలో పడిన కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది అని చెప్పుకొచ్చాడు.

అయితే బ్యాంకు ఖాతాల్లో కోట్లాదిగా డబ్బులు వస్తుండటంతో వాటిని విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి స్థానికులు, మీడియా ద్వారా సమాచారం అందిందని కతిహర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ మనోజ్ పాండే తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాన్ని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. తాము కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x