Bihar Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రంలో లాక్‌డౌన్

Bihar Lockdown: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. సెకండ్ వేవ్ అతి భయంకరంగా మారి..ప్రాణాలు హరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ..ఆందోళన కల్గిస్తుండటంతో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ బాట పడుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2021, 03:06 PM IST
Bihar Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రంలో లాక్‌డౌన్

Bihar Lockdown: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. సెకండ్ వేవ్ అతి భయంకరంగా మారి..ప్రాణాలు హరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ..ఆందోళన కల్గిస్తుండటంతో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ బాట పడుతున్నాయి.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave) అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ రోగుల ఇబ్బందులు అధికమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) వెంటాడుతోంది. మందుల కొరత ,బెడ్స్ లేకపోవడం చాలా సమస్యగా మారింది. ఆక్సిజన్ లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. ఆక్సిజన్ అందక మారణహోమం రేగుతోంది. 

ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ (Lockdown) అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ లేదా నైట్‌కర్ఫ్యూ లేదా పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తుండగా మరో రాష్ట్రం జాబితాలో చేరింది. బీహార్‌ ( Bihar Lockdown)లో తాజాగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar cm Nitish kumar) ప్రకటించారు. ఇవాళ్టి నుంచి మే 15 వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం బీహార్‌లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 24 గంటల్లో బీహార్‌లో 11 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Also read: India Corona Update: దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు 82 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News