Bipin Rawat Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక

Bipin Rawat Helicopter Accident: తమిళనాడులోని కూనూర్ సమీపంలో మిలిటరీ చాపర్ కూలిన ఘటనలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాద సమయంలో​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 08:24 AM IST
Bipin Rawat Helicopter Accident: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక

Bipin Rawat Helicopter Accident: తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మిలిటరీ చాపర్ కుప్పకూలింది. ప్రమాదం జరిగిన హెలికాప్టర్ లో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా కొందరు స్టాఫ్ ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

త్రిదళాధిపతి బిపిన్ రావత్.. సూలూర్​ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ సర్వీసెస్​ కాలేజీకి (డీఎస్​సీ) వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ​హెలికాప్టర్​ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి. సైన్యం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.

ఈ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat Helicopter Accident), ఆయన భార్య మధులికా రావత్ సహా బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్ కే గుర్సేవక్ సింగ్, ఎన్ కే జితేంద్ర కుమార్, ఎల్/ఎన్ కే వివేక్ కుమార్, ఎల్/ఎన్ కే బీ సాయి తేజ, హవ్ సత్పాల్ ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Also Read: CSD Bipin Rawat Helicopter Crash : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ జీవితమంతా ఆర్మీలోనే.. ఎన్నో రికార్డులు

Also Read: Bipin Rawat Helicopter Crash: హెలీకాప్టర్ ప్రమాదంలో 11 మంది మృతి, బిపిన్ రావత్‌కు తీవ్ర గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News