ఆ చట్టాలను రద్దు చేయడం ఎవరి తరం కాదు - అమిత్ షా

బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తీరును అమిత్ షా తీవ్ర స్థాయిలో ఎండగట్టారు 

Updated: Apr 24, 2019, 09:20 PM IST
ఆ చట్టాలను రద్దు చేయడం ఎవరి తరం కాదు - అమిత్ షా

బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా ..కాంగ్రెస్ హామీలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫిస్టోలో తాము అధికారంలోకి వస్తే 370 అధికరణలో ఎలాంటి మార్పులు చేయమని... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ( ఆఫ్‌స్పా) సమీక్షిస్తామని ప్రకటించింది. ఈ హామీలపై బీహార్‌లోని సమర్తిపూర్ బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ధ్వజమెత్తారు.

మరో గాంధీ వచ్చినా ఏం చేయలేరు...

ఈ సందర్భంగా అమిత్ షా మాటాడుతూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ( ఆఫ్‌స్పా ) రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. అదే జరిగితే ఆర్మీ సిబ్బందిపై కేసులు పెడతారు. ఆఫ్‌స్పాను రద్దు చేయవచ్చా ? నేను రాహుల్ గాంధీకి  ఒకటి చెప్పదలచుకున్నాను. మీ జీవితకాలంలో ఎప్పటికీ ఆ చట్టాన్ని రద్దు చేయలేరు. మీరే కాదు..మీ తర్వాత మరో గాంధీ వచ్చినా ఆ చట్టం రద్దు కాదు' అని అమిత్‌షా పేర్కొన్నారు

Tags: