హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ విక్టరీ

Last Updated : Dec 19, 2017, 09:48 AM IST
  • ప్రతీ ఐదేళ్లకు ఓసారి జరిగే మ్యాజికే మళ్లీ రిపీట్
  • ఓటమికి బాధ్యత తనదేనన్న సీఎం
  • గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకి కృతజ్ఞతలు తెలిపిన మోదీ
హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ విక్టరీ

హిమాచల్ ప్రదేశ్ లో 1985 నుంచి ప్రతీ ఐదేళ్లకు ఓసారి జరిగే మ్యాజికే మళ్లీ రిపీట్ అయింది. ప్రతీ ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం పార్టీల చేతులు మారడం ఇక్కడ 1985 నుంచి ఓ ఆనవాయితీగా వస్తోంది. అదే ఆనవాయితీ ప్రకారమే ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవగా ఈసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 68 స్థానాలకిగాను బీజేపీ 43 స్థానాల్లో విజయం సొంతం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు, ఇతరులు మరో నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పై 22 అత్యధిక స్థానాల్లో గెలుపొంది తన సత్తా ఏంటో చాటుకుంది బీజేపీ.

హిమాచల్ ప్రదేశ్ లో తమ పరిస్థితి ఏదైనా.. అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ ప్రకటించారు. ఇదిలావుంటే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం కైవసం చేసుకోవడంపై హర్షం వ్యక్తంచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. తమ పార్టీపై ఆ రెండు రాష్ట్రాల ప్రజలకి వున్న నమ్మకాన్ని వమ్ము చేయం అని హామీ ఇచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలని మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తామని మోదీ స్పష్టంచేశారు.

Trending News