టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన శివసేన

ఎన్డీఏ ప్రభుత్వంపై త్వరలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్న టీడీపీ ఎంపీలకు శివసేన షాక్ ఇచ్చింది.

Last Updated : Jul 15, 2018, 10:03 PM IST
టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన శివసేన

ఎన్డీఏ ప్రభుత్వంపై త్వరలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్న టీడీపీ ఎంపీలకు శివసేన షాక్ ఇచ్చింది. శివసేన మద్దతు తీసుకోవడానికి ముంబయి వెళ్లిన పలువురు టీడీపీ ఎంపీలను శివసేన నేతలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ముఖ్యంగా శివసేన నేత ఉద్దవ్ థాక్రేని కలవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ ఎంపీలకు అడియాసే మిగిలింది.

ఆయన కలవరని సందేశం అందడంతో వారు నిరుత్సాహంలో పడిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడడానికి శివసేన నేతలతో పాటు ఎన్సీపీ నేతలతో భేటీ కానున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే టీడీపీ నేత తోట నరసింహం, మరో పార్లమెంటు మెంబరు రవీంద్రబాబుతో కలిసి ఇతర జాతీయ పార్టీ నేతలను సంప్రదిస్తూ.. టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం రచించిన పుస్తకాన్ని ఒకటి ఇస్తున్నారు. ఆ నేతలను ఆంధ్రప్రదేశ్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారు. 

ఈ క్రమంలోనే శివసేనను కలవాలని టీడీపీ ఎంపీలు భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. శివసేన కూడా మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వంపై కినుక వహించింది. అయితే ఈ మధ్యకాలంలో అమిత్ షా వెళ్లి కలిసి మాట్లాడడంతో వారు మళ్లీ మనసు మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే అమిత్ షా, ఉద్ధవ్ థాక్రేని కలిసి ఏం మాట్లాడారన్న విషయంపై కూడా ఆసక్తికరమైన చర్చ మీడియాలో జరిగింది.

అయితే.. శివసేన ఎన్డీఏలోనే కొనసాగుతుందన్న అంశంపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో ప్రత్యేక హోదాకి మద్దతివ్వాలని వచ్చిన టీడీపీ ఎంపీలను శివసేన నేతలు దూరం పెట్టారని కూడా కొందరు రాజకీయ నిపుణులు అంటున్నారు.

Trending News