బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు తుపాకీ పట్టుకుని ఓ మహిళను బెదిరిస్తూ హల్‌చల్ సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ వద్ద బీఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ పాండే కుమారుడు ఆశిష్ పాండే పిస్తోల్‌తో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ.. వారితో వాగ్వాదానికి దిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. ఆశిష్ ఆ మహిళను బెదిరిస్తూ, తిడుతూ ఉండడంతో వీడియోలో కనిపించింది. ఆదివారం రాత్రి ఓ పార్టీ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
కాగా ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించారు. బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండే కుమారుడు ఆశిష్ పాండేపై కేసు నమోదు చేశారు. ఆదివారం బహిరంగంగా తుపాకీతో బెదిరించిన ఆశిష్ పాండేపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు.. అతడిని అరెస్ట్ చేయనున్నట్లు ఢిల్లీ స్పెషల్ జాయింట్ సీపీ వెల్లడించారు. 11 సెకన్ల నిడివి గల ఆ వీడియోను మీరూ చూడండి..
#WATCH A man brandishes a gun outside a 5-star hotel in Delhi on October 14. A case has been registered in connection with the incident. #Delhi pic.twitter.com/G14eqVJU0U
— ANI (@ANI) October 16, 2018