మిడిల్ క్లాస్ కు ఊరట; ఆదాయపు పన్ను పరిమితి పెంపు

                               

Last Updated : Feb 1, 2019, 03:36 PM IST
మిడిల్ క్లాస్ కు ఊరట; ఆదాయపు పన్ను పరిమితి పెంపు

కేంద్రం మంత్రి పియూష్ గోయల్ మధ్యతరగతి ప్రజలకు తీపికబురు అందించారు. ఆదాయపు పన్ను పరిమితిని  2.5 నుంచి  5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో పియూష్ గోయల్ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. తాజా నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలెకాలంలో ఆగ్రవర్ణాల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఏడాదికి రూ. 7 లక్షల  ఆదాయం లోపు ఉన్న వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయని బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే.  పన్ను కట్టే వాళ్లు పేదలుగా ఎలా పరిగణిస్తారని విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంలో బడ్జెట్ పరిమితి పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై కసరత్తు చేసిన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

ప్రయోజనాలు ఇవే...

ఆర్ధిక శాఖ  తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు. అలాగే రూ.6.5లక్షల వరకూ ఉన్న వారికి బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ ఇస్తారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచినట్లయింది. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితి పెంచారు. అలాగే, టీడీఎస్‌ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40వేలకు పెంచారు.

Trending News