Self murder:సుపారీ ఇచ్చి మరీ సొంత మర్డర్ చేయించుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..!

Own killing | న్యూ ఢిల్లీ: శత్రువుల చేతిలో హత్యకు గురైతే దానిని మర్డర్ ( Murder) అంటాం. మరి శత్రువులే లేకున్నా.. ఓ కిల్లర్స్ బ్యాచ్‌కి సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించుకుంటే దానిని ఏమంటాం ? ఏంటి ఎక్కడైనా అలా కూడా జరుగుతుందా ఎక్కడైనా అని అనిపిస్తుందా ? కానీ ఢిల్లీలో అచ్చం అలాగే జరిగింది. అవును.. ఢిల్లీలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి తన హత్యకు తానే ప్లాన్ ( Murder pkot) చేసుకున్నాడు.

Last Updated : Jun 16, 2020, 12:06 PM IST
Self murder:సుపారీ ఇచ్చి మరీ సొంత మర్డర్ చేయించుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..!

Own killing | న్యూ ఢిల్లీ: శత్రువుల చేతిలో హత్యకు గురైతే దానిని మర్డర్ ( Murder) అంటాం. మరి శత్రువులే లేకున్నా.. ఓ కిల్లర్స్ బ్యాచ్‌కి సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించుకుంటే దానిని ఏమంటాం ? ఏంటి ఎక్కడైనా అలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుందా ? కానీ ఢిల్లీలో అచ్చం అలాగే జరిగింది. అవును.. ఢిల్లీలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి తన హత్యకు తానే ప్లాన్ ( Murder plot) చేసుకున్నాడు. తాను చనిపోతే తన కుటుంబానికి ఇన్సూరెన్స్ మనీ ( Insurance policy money) వస్తుందనే పిచ్చి ఆలోచనతో తన చావుకు తానే సుపారీ ( Supari ) ఇచ్చి మరీ స్కెచ్ వేసుకున్నాడు. అప్పటికే పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల మధ్య కూరుకుపోవడంతో తన మర్డర్‌కి అవసరమైన డబ్బులను సైతం అతడు రుణంగానే తీసుకున్నాడు. ( సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్ అంటున్న హీరోయిన్ )

ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 9న రాత్రి 12.30 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ పోలీసు స్టేషన్‌కి వచ్చిన ఓ మహిళ.. తన భర్త గౌరవ్ భన్సాల్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కర్కడూమా గ్రామంలో తన భర్త ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తారని.. ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన అతడు ఇప్పటివరకు తిరిగా రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేస్తే.. నెంబర్ స్విచాఫ్ అని వస్తోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆనంద్ విహార్ పోలీసులు ఓ మిస్సింగ్ కేసు ( Missing case) నమోదు చేశారు. Telangana: కరోనా పాజిటివ్ కేసుల లేటెస్ట్ హెల్త్ బులెటిన్ అప్‌డేట్స్ )

ఆ మరుసటి రోజే ఢిల్లీ పోలీసులకు ఓ పీసీఆర్ కాల్ వచ్చింది. రనోలా పోలీసు స్టేషన్ పరిధిలో చెట్టుకి ఓ వ్యక్తి మృతదేహం వేళ్లాడుతోందనేది ఆ కాల్ సారాంశం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు.. అక్కడ లభించిన ఆధారాల ఆధారంగా గౌరవ్ భన్సాల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని గుర్తించారు. ఆ తర్వాతే తెలిసింది.. ఆ గౌరవ్ భన్సాల్ ఎవరో కాదు.. అంతకు ముందు రోజు రాత్రి ఆనంద్ విహార్ పోలీసు స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో అదృశ్యమైన వ్యక్తేనని. Telangana exams: డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ )

గౌరవ్ భన్సాల్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా సూరజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూరజ్‌ని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. తమ ముఠాలో మరో ముగ్గురు ఉన్నారని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే గౌరవ్ సుపారీ ( Supari for murder) ఇచ్చి మరీ ఈ మర్డర్ ప్లాన్ చేశాడని అంగీకరించాడు. సూరజ్ ఇచ్చిన సమాచారంతో మనోజ్, సుమిత్ అనే ఇద్దరు నిందితులతో పాటు ఈ నేరంలో పాల్పంచుకున్న మరో బాల నేరస్తుడిని (పేరు వెల్లడించడం లేదు) పోలీసులు అరెస్ట్ చేశారు. ( పేట్లబుర్జులోని ప్రసూతి దవాఖానలో 32 మందికి కరోనా )

పోలీసుల విచారణలో బాల నేరస్తుడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. గౌరవ్ భన్సాల్ తనకు కూడా సుపారీ ఇచ్చాడని.. నజఫ్‌ఘడ్ నాలా సమీపంలో ఖేరీ బాబా పూల్ వద్ద చెట్టుకు ఉరేసి అతడిని హత్య చేసినట్టు తెలిపాడు. తాను హత్యకు గురైతే.. తన కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ మనీ ( Insurance money) వస్తాయనే ఉద్దేశంతోనే గౌరవ్ ఈ హత్యకు సుపారీ ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. కిల్లర్స్ బ్యాచ్‌కి సుపారీ ఇవ్వడం కోసం అతడు రూ. 6 లక్షల పర్సనల్ లోన్ సైతం తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. డీసీపీ (ఔటర్) ఏ కోన్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రిమాండ్‌కి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News