క్యాబ్ రైడ్‌ను రద్దు చేస్తే.. భారీ జరిమానా!

క్యాబ్ రైడ్‌ను రద్దు చేస్తే.. భారీ జరిమానా!

Last Updated : Sep 30, 2018, 02:49 PM IST
క్యాబ్ రైడ్‌ను రద్దు చేస్తే.. భారీ జరిమానా!

కుటుంబంతో కలిసి బయటికి వెళ్లాలంటే క్యాబ్‌ను బుక్ చేసుకుంటుంటారు అవునా! దాదాపు అన్ని మెట్రో నగరాల్లో ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు చాలా సందర్భల్లో క్యాబ్ డ్రైవర్లు రైడ్²ను ఏదో కారణంతో రద్దు చేస్తుంటారు. కానీ ఇక మీదట అలా జరగదులేండి..! బుక్ చేసుకున్న క్యాబ్‌ను రద్దు చేస్తే రూ.25వేలు జరిమానా విధించనున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. క్యాబ్ డ్రైవర్ రైడ్‌ను పొరపాటున క్యాన్సిల్ చేస్తే రూ.25వేలు జరిమానా విధించనున్నారు. పెరుగుతున్న క్యాబ్ ధరలను నియంత్రించడం, ప్రయాణీకులు, మహిళల భద్రత అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలిసింది. ప్రముఖ జాతీయ మీడియా కథనం మేరకు.. ఈ డ్రాఫ్ట్ బిల్లులో రైడర్ నుండి లైంగిక వేధింపుల విషయంలో క్యాబ్ అగ్రిగేటర్లు ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ అగ్రిగేటర్ అలా చేయకపోతే.. రూ.లక్ష రూపాయలు చెల్లించాలి. కాగా ఈ డ్రాఫ్ట్ బిల్లును అరవింద్ క్రేజీవాల్ నేతృత్వంలోని కేబినెట్ త్వరలో ఆమోదముద్ర వేయనుందని నివేదికలు పేర్కొన్నాయి.

క్యాబ్ ధరల పెరుగుదలఫై నియంత్రణ ఉండాలన్న ఉద్దేశంతో.. క్యాబ్ అగ్రిగేటర్స్ రవాణా శాఖ నిబంధనలకు లోబడి గరిష్ట, కనీస ఛార్జీలను వసూలు చేయాలని నిబంధన పెట్టారు. ఒకవేళ అగ్రిగేటర్ అలా చేయడంలో విఫలమైతే, రూ .25,000 జరిమానా కట్టాలని పేర్కొన్నారు.

Trending News