14 Apps Banned: బి అలర్ట్.. ఈ 14 యాప్స్ తో దేశ భద్రతకి ముప్పు

2020 సంవత్సరంలో దేశ భద్రత ముప్పు దృష్ట్యా.. దాదాపు 320 చైనా యాప్ లను భారత సర్కారు బాన్ చేసిన సంగతి తెలిసిందే! ఇపుడు కూడా కొత్తగా 14 మెసేజింగ్ యాప్ లను బాన్ చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 05:36 PM IST
14 Apps Banned: బి అలర్ట్.. ఈ 14 యాప్స్ తో దేశ భద్రతకి ముప్పు

14 Apps Banned: దేశ భద్రతకి ముప్పు అనే ఉద్దేశ్యంతో 2020 సంవత్సరంలో చైనాకి చెందిన దాదాపు 320 మొబైల్ యాప్స్ ని కేంద్రంలోని మోడీ సర్కార్ బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఆ సమయంలో టిక్ టాక్ ను బ్యాన్‌ చేయడం హాట్ టాపిక్ గా మారింది. టిక్ టాక్‌ కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్‌ ఉండటంతో భారీగా మాతృ సంస్థకు లాభాలు వచ్చేవి. 

కానీ ఇండియాలో టిక్‌ టాక్ తో పాటు మొత్తం 60 యాప్స్ ను బ్యాన్ చేయడం జరిగింది. దేశ భద్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ యాప్స్ ను బ్యాన్‌ చేయడాన్ని భారతీయులు కూడా స్వాగతించారు. ఆ యాప్స్ కి బదులు ఎన్నో కొత్త యాప్స్‌ వచ్చాయి. యాప్స్ విషయంలో ఎప్పటికప్పుడు దేశ రక్షణ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. 

తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం 14 మెసేజింగ్ యాప్ లను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ యాప్స్ ద్వారా పాకిస్తాన్‌ నుండి సమాచారం రాక పోకలు జరుగుతున్నట్లుగా రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. ఆ యాప్స్ ద్వారా పాకిస్తాన్ నుండి సమాచారం అందుకుంటున్న ఉగ్రవాదులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర సర్కార్ భావిస్తోంది. 

అందులో భాగంగానే 14 మెసేజింగ్ యాప్స్ ను బ్యాన్‌ చేయడం జరిగింది. ఉగ్రవాదులకు మరియు పాకిస్తాన్‌ మద్దతుదారులకు కమ్యూనికేషన్‌ వ్యవస్థగా ఉంటున్న ఆ యాప్స్ వల్ల దేశ భద్రతకి ముప్పు అనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ యాప్స్ ను పూర్తిగా బ్యాన్‌ చేశారు.

Also Read: Virat Kohli-Anushka Sharma: నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. విరాట్ కోహ్లీ ట్వీట్‌ వైరల్‌!  

దేశంలో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌ తో పాటు సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా ఈ యాప్స్ ను వినియోగిస్తున్నట్లుగా రక్షణ శాఖ గుర్తించింది. అందుకే పాకిస్తాన్‌ కు సమాచారం అందిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం అయ్యింది. దేశ భద్రతకి ముప్పుగా భావించిన త్రీయా, జాంగి, ఎలిమెంట్‌, సెకండ్ లైన్‌, క్రిప్వైజర్‌, ఎనిగ్మా, సేఫ్వ్సిస్‌, విక్రమ్‌, మీడియా ఫైర్‌, బ్రియార్, బీ ఛాట్‌, నంద్‌ బాక్స్‌, కోనియన్‌, ఏఎంవో యాప్‌ లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. 

మరి కొన్ని సందేహాత్మక యాప్స్‌ కూడా ఉన్నాయని.. వాటి విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐటీ యాక్ట్‌ ప్రకారమే ఈ నిషేదం విధించినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. ఆ యాప్స్‌ కు చెందిన వారు ఎవ్వరు కూడా భారత్ కు చెందిన వారు కాదని.. వారు విదేశాల నుండి ఆ యాప్స్ ను రన్ చేస్తున్న కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Also Read: Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసులో కోర్టు సంచలన తీర్పు.. కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News