Pension Scheme: కోవిడ్‌తో మరణిస్తే..కుటుంబసభ్యులకు జీవితాంతం పెన్షన్

Pension Scheme: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూస్ అందించింది. మరణించిన కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 28, 2021, 09:46 PM IST
Pension Scheme: కోవిడ్‌తో మరణిస్తే..కుటుంబసభ్యులకు జీవితాంతం పెన్షన్

Pension Scheme: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూస్ అందించింది. మరణించిన కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు. 

కరోనా మహమ్మారి(Corona pandemic) కారణంగా మరణించిన కార్మికుల కోసం ఈఎస్ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తేలీ తెలిపారు. రాజ్యసభలో(Rajyasabha) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి(Vijayasaireddy) అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈఎస్ఐసీ పథకం గురించి వివరించారు. 2020 మార్చ్ 23 నుంచి ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ స్కీమ్ రెండేళ్లపాటు అమలులో ఉంటుందన్నారు. ఈఎస్ఐసీలో ఇన్సూర్ అయిన కార్మికులలపై ఆధారపడిన కుటుంబసభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కింద మరణించిన ఉద్యోగి పొందే జీతంలో 90 శాతం పింఛన్‌గా అందించనున్నారు. 

కరోనా సోకినట్టు గుర్తించిన రోజు నుంచి 3 నెలలలోగా కార్మికుడు లేదా ఉద్యోగి తప్పనిసరిగా ఈఎస్ఐసీ (ESIC) ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు నమోదై ఉండాలి. కోవిడ్ బారిన పడటానికి ముందు కనీసం 70 రోజులపాటు ఆ ఉద్యోగి తరపున ఈఎస్ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి. కరోనాతో మరణించిన వ్యక్తి మహిళ అయితే..భర్తకు పింఛన్ లభించనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్ నిబంధనల ప్రకారం కార్మికుడి మరణానంతరం అతడి భార్య తిరిగి వివాహం చేసుకునేంతవరకూ పింఛన్ వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధిలో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు ఈఎస్ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం(ESIC Covid Relief Scheme) వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పింఛన్‌కు అర్హులైన కుటుంబసభ్యుల్లో భర్త లేదా భార్య జీవితాంతం పెన్షన్ పొందనున్నారు.

Also read: CM Basavaraj Bommai: యడియూరప్ప సర్కారుపై బసవరాజ్ బొమ్మై ఏమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News