Online Education: ఐఐటీ, ఐఐఎంలు పూర్తిగా ఆన్ లైన్ లో ?

నిన్న నూతన విద్యావిధానం ( New Education system )..ఇప్పుడిక ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు. తొలిదశలో భాగంగా ఐఐటీ ( IIT ), ఐఐఎం (IIM ) లలో ఆన్ లైన్ విద్యావిధానం. యూజీసీ, ఏఐసీటీఈ లతో ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. అదే జరిగితే ఇక ఇంట్లోంచే ఉన్నత చదువులు సైతం…

Last Updated : Aug 12, 2020, 11:23 PM IST
Online Education: ఐఐటీ, ఐఐఎంలు పూర్తిగా ఆన్ లైన్ లో ?

నిన్న నూతన విద్యావిధానం ( New Education system )..ఇప్పుడిక ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు. తొలిదశలో భాగంగా ఐఐటీ ( IIT ), ఐఐఎం (IIM ) లలో ఆన్ లైన్ విద్యావిధానం. యూజీసీ, ఏఐసీటీఈ లతో ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. అదే జరిగితే ఇక ఇంట్లోంచే ఉన్నత చదువులు సైతం.

ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్నత విద్యారంగమైన ఐఐటీ, ఐఐఎంలలో కూడా మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ దిశగా యూజీసీ ( UGC ) , ఏఐసీటీఈ ( AICTE ) లతో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. విద్యార్దుల్ని బౌతికంగా క్లాసులు నిర్వహించే భారం విద్యా సంస్థలకు లేకుండా చేసేందుకు మొత్తం విద్యావ్యవస్థను ఆన్ లైన్ విద్యావ్యవస్ధగా మార్చే ప్రతిపాదన ఇప్పుడు ప్రభుత్వ పలిశీలనలో ఉందని తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలో సమగ్ర ప్రణాళిక తయారుచేసేందుకు ఏఐసీటీఈ ఛీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. క్వాలిటేటివ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదిక ( Digital platform ) ను ఏర్పాటు చేసే బాధ్యత ఇప్పుడు వీరిపై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే తొలిదశలో ఐఐటీ, ఐఐఎంలు ఆన్ లైన్ లో రానున్నాయి. తరువాత దశలో మిగిలిన కోర్సులు. Also read: New Taxation scheme: ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త పథకం

Trending News