ఆదాయపు పన్ను విభాగంలో మరో కీలకమైన పధకం ప్రారంభం కానుంది. ఇన్ కంటాక్స్ చెల్లింపుదార్లకు గౌరవం అందించే వినూత్న పధకమిది. ఆగస్టు 13 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
“Transparent Taxation – Honoring the Honest” పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 13 ఉదయం 11 గంటలకు ఈ వినూత్న పధకం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభం కానుంది. పారదర్శక పన్ను విధానం-నిజాయితీకు గౌరవం పేరుతో ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోని పన్ను విధానంలో సంస్కరణలు, సరళీకృతం దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఈ కొత్త విధానం బలం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ దేశ పురోగతికి తోడ్పడుతున్నవారికి ఇది మేలు చేకూరుస్తుందని మోదీ తెలిపారు.
Prime Minister Narendra Modi will launch a platform for “Transparent Taxation – Honoring the Honest” via video conferencing at 11 AM on 13th August, Thursday pic.twitter.com/pdODQb0A2l
— ANI (@ANI) August 12, 2020
ఈ కొత్త విధానం ద్వారా నిజాయితీగా పన్ను చెల్లించేవారికి గౌరవ సత్కారమందించే ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.