మూకుమ్మడి దాడి ఘటనలపై హోంమంత్రి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీ..!

ఈ మధ్యకాలంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను ఆధారంగా చేసుకొని కొన్ని మూకుమ్మడి దాడులు జరుగుతుంటే.. కొన్ని దాడులు అనుమానాల వల్ల జరుగుతున్నాయి. 

Last Updated : Jul 23, 2018, 09:09 PM IST
మూకుమ్మడి దాడి ఘటనలపై హోంమంత్రి ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీ..!

ఈ మధ్యకాలంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను ఆధారంగా చేసుకొని కొన్ని మూకుమ్మడి దాడులు జరుగుతుంటే.. కొన్ని దాడులు అనుమానాల వల్ల జరుగుతున్నాయి. ఈ దాడుల్లో చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని అనేకమంది నేరాలకు పాల్పడుతున్నా.. పోలీసులు కూడా నిస్సహాయులుగానే చూడాల్సి వస్తోంది. అయితే ఈ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేయాలని భావించింది భారత ప్రభుత్వం. కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గాబా ఈ కమిటీకి అధ్యక్షత వహించగా.. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కమిటీలో బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఈ మధ్యకాలంలో అనూహ్యమైన రీతిలో మూకుమ్మడి దాడులు పెరుగుతున్న క్రమంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి చట్టాన్ని తీసుకురావాలని సుప్రీం కోర్టు పార్లమెంటుకి సూచించింది. హింసను ప్రేరేపించే ఏ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవలే అల్వార్ జిల్లాలో రక్బర్ ఖాన్ అనే ఓ రైతు పాల వ్యాపారం చేయడం కోసం ఆవును కొని తరలిస్తుండగా.. దానిని వధించడానికే తీసుకెళ్తున్నారనే అభిప్రాయంతో గోసంరక్షకులు పేరుతో కొందరు ఆయనపై దాడి చేసి హతమార్చారు. 

Trending News