కోడికత్తి దాడిపై జగన్ ఫిర్యాదు చేయలేదు..అలాంటి కేసును ఎన్ఐఏకు అప్పగించడమేంటి ? - చంద్రబాబు

జగన్ పై కోడికత్తి దాడి  కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Last Updated : Jan 12, 2019, 08:42 PM IST
కోడికత్తి దాడిపై జగన్ ఫిర్యాదు చేయలేదు..అలాంటి కేసును ఎన్ఐఏకు అప్పగించడమేంటి ? - చంద్రబాబు

అమరావతి: జగన్ కోడికత్తి దాడి కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కోడికత్తి వ్యవహారంపై బాధితుడైన జగన్ దీనిపై  కేసు కూడా పెట్టలేదు..అలాంటి  అంశంపై కేంద్రం స్పందించి.. ఎన్ఐఏకు అప్పగించడమేంటి ? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడికత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించిన ఘనత మోడీ సర్కార్ కే దక్కుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు ఎద్దేవ చేశారు.

రాష్ట్రాల అధికారాన్ని హరిస్తున్న మోడీ సర్కార్

మోడీ సర్కార్ ఈ నాలున్నరేళ్ల పాలనలో సీబీఐ,ఆర్బీఐ సహా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఈ కేసును కేంద్రం ప్రభుత్వం.. ఎన్ఐఏకు అప్పగించడడమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదని.. కేంద్రం తీసుకున్న ఈ చర్యలు ముమ్మాటికి రాష్ట్రాల హక్కును హరించమేనన్నారు.ఇప్పటికే ఈ అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశామన్న చంద్రబాబు..ఎన్ఐఏ జోక్యాన్ని తప్పించి ఆ జీవోను రద్దు చేయాలని కోరామన్నారు. ఈ విషయంలో కేంద్రం దిగి రాకుంటే న్యాయపోరాటానికి సిద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Trending News