Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3లో చివరి కీలక ఘట్టం సక్సెస్, మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన విక్రమ్ ల్యాండర్

Chandrayaan 3 Updates: మరో ఆరు రోజులు. ప్రపంచమంతా ఇస్రో వైపు చూసే రోజు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 సక్సెస్ మాట వినేందుకు అందరూ ఎదురు చూస్తున్న సందర్భం. చివరి దశలో విజయవంతంగా ప్రవేశించడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 03:19 PM IST
Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3లో చివరి కీలక ఘట్టం సక్సెస్, మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన విక్రమ్ ల్యాండర్

Chandrayaan 3 Updates: ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు మరి కొద్దిరోజులే మిగిలుంది. కేవలం వారం రోజుల్లో ఇస్రో నుంచి శుభవార్త వినేందుకు సిద్ధం కండి. చంద్రయాన్ కక్ష్య దూరాన్ని తగ్గించే చివరి ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఇక మిగిలింది చంద్రునిపై దిగడమే. ఆ క్షణం కోసమే ఇప్పుడు అందరి ఎదురుచూపులు. 

జూలై 14వ తేదీన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రునికి మరింత చేరువైంది. ఐదవ సారి చివరిసారిగా చంద్రయాన్ 3 కక్ష్య దూరాన్ని విజయవంతంగా తగ్గించగలిగారు. అంటే ఇక చంద్రయాన్ 3 కు సంబంధించి ల్యాండింగ్ తప్ప అన్నీ ప్రక్రియలు అనుకున్నట్టుగానే సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుుడు మిగిలింది ఒకే ఒక ప్రక్రియ. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడం. ఇవాళ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. ఇప్పుడిక స్వతంత్రంగా చంద్రునిపై  మిగిలిన కాస్త దూరాన్ని పూర్తి చేసి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది.

దూరాన్ని తగ్గించడంతో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ సురక్షితంగా, విజయవంతంగా విడిపోవడంతో ఇక ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు ఆసక్తి పెరిగిపోయింది. అదే జరిగితే ఈ ఘనత సాధించిన నాలుగవ దేశమౌతుంది ఇండియా. ఇంతకుముందు ఈ ఘనతను యూఎస్, రష్యా, చైనా సాధించాయి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది. చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం కావడంతో చంద్రయాన్ 3ను ఇస్రో చాలా సవాలుగా తీసుకుంది. ప్రతి చిన్న అంశాన్ని పరిగణలో తీసుకుని చర్యలు చేపట్టింది.

రేపు శుక్రవారం నాడు అంటే ఆగస్టు 18 వ తేదీన ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దిగువ ఆర్బిట్‌కు చేరువలో వస్తుంది. ల్యాండర్ చంద్రునిపై ఆగస్టు 23న దిగాల్సి ఉంది. అయితే మాడ్యూల్ మాత్రం ఇక ఇదే ఆర్బిట్‌లో కొన్నేళ్ల వరకూ తిరుగుతూనే ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు పితామహుడిగా భావించే విక్రమ్ సారాభాయి పేరుతో చంద్రయాన్ 3 మిషన్ నామకరణం జరిగింది. ఇప్పుడిక ల్యాండర్‌లో ఉన్న ఇంథనాన్ని మండించి ఈ నెల 19, 21 తేదీల్లో రెండు సార్లు ఇస్రో ప్రత్యేక చర్చలు చేపట్టనుంది.

Also read: Noida Earthquake News Today: నొయిడాలో భూకంపం.. హడలెత్తిస్తున్న వరుస భూకంపాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News