Chattisgarh Encounter Between Maoists And Security forces In Kanker: దేశంలో ఒకవైపు కేంద్రఎన్నిలక సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈక్రమంలో ఎన్నికల సంఘం అనేక చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఛతీస్ గఢ్ సరిహద్దు రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి.ఛత్తీస్ గఢ్ ప్రాంతమంతా హైటెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీగా ఎన్‌కౌంటర్‌లో సంభవించినట్లు తెలుస్తొంది. ఈ ఘటనను సీనియర్ పోలీసు అధికారి ఐకె ఎలెసెలా వెల్లడించారు.
Read More: Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..
సరిహద్దు భద్రతా దళంతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలకు చెందిన రెండు విభాగాలైన డిఆర్‌జి , బస్తర్ ఫైటర్స్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని అధికారులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. పెట్రోలింగ్ బృందం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో, మావోలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భద్రత సిబ్బంది కూడా ప్రతిగా దాడులు జరిపారు.ఈ ఘటనలో దాదాపు 18 మంది మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ కాల్పులలో భద్రత సిబ్బంది కూడా పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
ఏడు దశల జాతీయ ఎన్నికలలో రెండవ దశ - ఏప్రిల్ 26న కంకేర్ జిల్లా ఓటింగ్ జరగనుంది. 2008లో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కి , సరిహద్దు భద్రతా దళానికి మధ్య ఈ పోరాటం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైందని వర్గాలు తెలిపాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గడిచిన ఫిబ్రవరిలో కాంకేర్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. గత ఏడాది కూడా నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతుండగా అదే జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత చనిపోయినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter