/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

డోక్లాం వివాదం ముదురుతున్న నేపథ్యంలో భారత్ - చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య యుద్దం అనివార్యమైతే  చైనాకే అధిక నష్టం జరుగుతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు

ప్రపంచ జనాభాలో 35 శాతం  నివసించే ఈ రెండు భారీ దేశాల్లో ( భారత్ - చైనా ) ఓ చిన్నాపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? ..అన్నదే ఇక అందరి మెడళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఒక వేళ యుద్దం తలెత్తితే ఎవరికి..ఎంత నష్టం అనే అంశంపై చర్చ జరుగుతోంది. యుద్ధం జరిగితే ఒక్క సిక్కిం సెక్టార్ కే పరిమితం కాదని.. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వరకు వ్యాపించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

1962లో చైనాతో పోల్చితే భారత్ పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. దీనికి తోడు అపట్లో రక్షణ రంగం ఏమాత్రం బలంగా లేదు. దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులను ఆసరాగా తీసుకొని చైనా సఫలీకృతమైంది. అయితే ఇప్పటి భారత్ పరిస్థితులు పూర్తిగా భిన్నం.ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు చైనాకు దీటుగా ఉన్నాయ్. రక్షణ రంగం బలోపేతంగా ఉంది. వీటన్నంటికి తోడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సమర్ధ నాయకత్వం భారత్ సొంతం. ఇలాంటి స్థితిలో యుద్ధం చేస్తే..కష్టాలను కొని తెచ్చికోవడం తప్పితే మరోకరి ఉండదు.  పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ...చైనాకు లోలోపల భయం మాత్రం ఉంది.

చైనా ఆర్ధిక పతనం ఖాయం...

భారత్ తో యుద్ధానికి దిగితే చైనా ఆర్ధికంగా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఆ దేశానికి 80 శాతం ముడి చమురు  మలేషియా, ఇండోనేషియా నుంచి మాలాక సంధి ద్వారా సరఫరా జరుగుతుంది. మలాకా సంధి  .. భారత్ లోని అండామన్ నికోబార్ దీవుల సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతం గుండా జరిగే ముడిచమురు రవాణాపై యుద్ధప్రభావం పడుతుంది. దీవుల్లో భారత్ కు భారీ నౌకాదళం కేంద్రం ఉంది. నౌకా దళం రంగంలోకి దిగితే చైనా ఓడలు అండమాన్ పక్క నుంచి పోవడం కష్టం. గతంలో పాక్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో నూ ఈ కారణం వల్లే చైనా పాక్ కు సాయం చేసేందుకు వెనుకంజ వేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

చైనా-పాక్ ఆర్ధిక కారిడర్ ప్రాజెక్టు భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మౌలిక సదుపాయాాల కోసం  చైనా వేల కోట్ల డాలర్లు కుమ్మరించింది. చైనా యద్ధనానికి దిగితే అవి భారత సేనలకు లక్ష్యంగా మారుతాయి. దీంతో చైనా ఆర్ధికంగా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. దీంతో పాటు ఆ ప్రాజెక్టు కొనసాగింపు ప్రశ్నార్ధంగా మారుతుంది.

శ్రీలంక హంబంత్ తట్ పోర్టు, పాక్ లోని గ్వాదర్ పోర్టు, ఆఫ్రికాలోని జిబూటీ పోర్టుల్లో చైనా  కొన్ని సౌకర్యాలు పొందడానికి ఆయా దేశాలతో చైనా ఒప్పందాలు చేసుకుంది.  యుద్ధం ఆరంభమైతే ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి.దీంతో చైనా భారీ ఆర్ధిక నష్టం చవిచూడాల్సి వస్తోంది. 

వీటితో పాటు ఆగ్నేయాసియా దేశాలతో చేసుకున్న ఆర్ధిక ఒప్పందాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. కేవలం ఓ చిన్న పాటి కొండ ప్రాంతం కోసం భారత్ తో పోరుకు దిగితే భారీ నష్టం చవిచూడాల్సి వస్తోందని చైనాకు ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెదిరింపు వ్యహాలతో ఇతర ఆగ్రేయాసియా దేశాలను లొంగదీసుకున్నట్లు ఇండియాను దారికి తెచ్చుకోవడం కుదిరేపని కాదనేది చైనా నిపుణుల అభిప్రాయం. వీటన్నంటిని పరిగణిలోకి తీసుకోకుండా మొండిగా చైనా రణరంగంలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Section: 
English Title: 
China is damaged when it comes to war with India
News Source: 
Home Title: 

భారత్ తో పోరు.. చైనాకే నష్టం

భారత్ తో పోరు.. చైనాకే నష్టం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes