CISF Constable Recruitment 2024 Direct Apply: ప్రభుత్వ ఉద్యోగం మీ కల.. అయితే, మీకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/ ఫైర్ (మగ) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ సీఐఎస్ఎఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు వెంటనే cisfrectt.cis.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 సెప్టెంబర్ 30. ఈ నోటిఫికేషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ 1130 పోస్టులను భర్తీ చేయనుంది. సీఐఎస్ఎఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు 12 వ తరగతి లేదా తత్సమానం పాసై ఉండాలి. వారు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి కనీసం ఒక్క సబ్జెక్ట్ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థల వయస్సు 18-23 మధ్య ఉండాలి.
సీఐఎస్ఎఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు 01-10-2001 ముందు లేదా 30-09-2006 తర్వాత పుట్టి ఉండకూడదు.
ఇదీ చదవండి: రేపు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ..
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు చేసుకునే విధానం..
సీఐఎస్ఎఫ్ పోస్టులకు కేవలం ఆన్లైన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మొదటగా సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ cisfrectt.cisf.gov.in ఓపెన్ చేయాలి
ఆ తర్వాత హోంపేజీలోని లాగిన్ లింక్ ఓపెన్ చేయాలి.
ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి రిజిస్టర్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్ నింపి పేమెంట్ చేయాలి.
చివరగా సబ్మిట్పై క్లిక్ చేసి పేజీ డౌన్లోడ్ చేసుకోవాలి.
ఓ హార్డ్ కాపీని కూడా మీ వద్ద భవిష్యత్తు అవసరాల నిమిత్తం భద్రపరచుకోవాలి.
ఇదీ చదవండి: రేపు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ..
ఈ సీఐఎస్ఎఫ్ పోస్టుల దరఖాస్తుకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు నుంచి రాయితీ పొందుతారు. పేమెంట్ ఆన్లైన్లోనే చెల్లించాలి. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ఎస్బీఐ బ్రాంచీలకు వెళ్లి క్యాష్ పేమెంట్ కూడా చేయవచ్చు. కానీ, ఇతర ఏ విధానంలో చెల్లింపులు చేపట్టారు. ఈ సీఐఎస్ఎఫ్ పోస్టుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ వెబ్సైట్ నోటిఫికేషన్ క్షుణ్నంగా చదవవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.