close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

CISFలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

CISFలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

Updated: Oct 19, 2019, 03:56 PM IST
CISFలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు
Representational image

కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) బలగాల్లో పలు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత నెలలోనే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ కుక్, బార్బర్, కార్పెంటర్, స్వీపర్, పెయింట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని.. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఐఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తు ప్రారంభం కానుండగా అక్టోబర్ 22 చివరి తేదీగా ఉంది.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రెడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 20 వేల నుంచి కనీస వేతనం ఉంటుంది. 
దరఖాస్తు ఫీజు: జనరల్, OBC, EWS అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉండగా SC, ST, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు.
వయసు: అభ్యర్ధులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.