9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య; ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ పై కేసు నమోదు

ఢిల్లీలోని మయూర్ విహార్ లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినందుకు ఇద్దరు టీచర్లు, పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ పై నోయిడా పోలీసులు మంగళవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Last Updated : Mar 21, 2018, 11:32 AM IST
9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య; ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ పై కేసు నమోదు

ఢిల్లీలోని మయూర్ విహార్ లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినందుకు ఇద్దరు టీచర్లు, పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ పై నోయిడా పోలీసులు మంగళవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆ విద్యార్థిని చనిపోయిందని అమ్మాయి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

మంగళవారం ఆత్మహత్య చేసుకున్న15 ఏళ్ల విద్యార్థి నోయిడాలో సెక్టార్ 52 నివాసి. ఆమె మంచి డాన్సర్ కూడా. పాఠశాలలో ఓ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడని విద్యార్థిని తల్లి తండ్రులు ఆరోపించారు. 'అనుకున్నట్లే పరీక్షల్లో ఫెయిల్ చేశాడు ఆ టీచర్. ఆ స్కూల్ నా కూతురిని చంపింది' అని రోదిస్తూ ఆ తండ్రి చెప్పారు.

పాఠశాల పరీక్ష ఫలితాలు మార్చి 16న వచ్చాయి. ఆమె రెండు సబ్జెక్టులు తప్పింది. పరీక్ష ఫలితాలు చూసి తట్టుకోలేక.. తీవ్ర ఒత్తిడికిలోనై క్షణికావేశంలో ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆమెను.. కొన ఊపిరితో ఉండగా హుటాహుటిన  నోయిడాలో కైలాష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పల్స్, రక్తపోటు డౌన్ అవడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. పోస్ట్ మార్టం తరువాత మరణానికి గల కారణాలు తెలుస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు.

నోయిడా పోలీసులు కుటుంబ సభ్యుల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. నోయిడా సిటీ ఎస్పి అరుణ్ కుమార్ సింగ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, ఈ కేసును సెక్షన్ 306, 506 ఐపిసి, పిఒసీఎస్ఓ చట్టం కింద నమోదు చేశామని.. బుధవారం పాఠశాలను సందర్శిస్తామని చెప్పారు.

Trending News