జేడీఎస్ మా ఆఫర్‌ను అంగీకరించింది: గులాం నబీ ఆజాద్

జేడీఎస్ మద్దతుతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ రచన చేసింది.

Last Updated : May 15, 2018, 04:59 PM IST
జేడీఎస్ మా ఆఫర్‌ను అంగీకరించింది: గులాం నబీ ఆజాద్

జేడీఎస్ మద్దతుతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ రచన చేసింది. జేడీఎస్ నేత కుమారస్వామికి కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించింది. జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని సమాచారం. కుమారస్వామి ప్రభుత్వానికి బైటినుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కోరనున్నాయి. జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిద్దరామయ్య అన్నారు.

'ప్రజా తీర్పును స్వాగతిస్తాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాకు తగిన సంఖ్యా బలం లేదు కాబట్టి జేడీఎస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్దమే' అని కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర తెలిపారు.

 

'మేము దేవెగౌడ, కుమారస్వామితో  ఫోన్‌లో మాట్లాడాము. వారు మా ఆఫర్‌ను అంగీకరించారు' అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.

 

జేడీఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి ఈరోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

 కాగా, సీఎం సిద్ధరామయ్య సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.

 

 

 

Trending News