Hathras Case: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో హత్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులను గురువారం యూపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాహుల్ గాంధీపై లాఠీఛార్జ్ కూడా చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అప్పటినుంచి పలు పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన చాలా ఎంపీలు హత్రాస్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నాటికి హత్రాస్‌కు చేరుకోని బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్, ఎంపీలు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోనున్నారని వెల్లడించాయి. ఓవైపు పోలీసులు అనుమతి లేదంటుండగానే.. మరోవైపు రాహుల్ గాంధీతోపాటు.. పలువురు ఎంపీలు హత్రాస్‌కు బయలుదేరనుండంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాహుల్ ట్విట్ చేశారు. ఏ ఫోర్స్ తనను హత్రాస్ వెళ్లకుండా ఆపలేదని, హత్రాస్ బాధితురాలి కుటుంబసభ్యులను కలవకుండా నిలువరించలేదంటూ ట్విట్ చేశారు. దీంతో అధికారులు పోలీసులను భారీగా మోహరించారు. ఢిల్లీ నుంచి నోయిడాలోకి ప్రవేశించే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు.
Noida: Visuals from the toll plaza at Delhi Noida Direct Flyway.
Congress leader Rahul Gandhi & other party MPs are scheduled to visit Hathras today afternoon to meet the family of the victim of Hathras case. pic.twitter.com/c4bCl2Bsuz
— ANI UP (@ANINewsUP) October 3, 2020
ఇదిలాఉంటే.. బాధితురాలి గ్రామంలోకి ప్రస్తుతం మీడియాకు మాత్రమే అనుమతి ఉందని హత్రాస్ ఎస్డీఎం ప్రేమ్ ప్రకాష్ మీనా తెలిపారు. ప్రజా ప్రతినిధులను అనుమతించమని ఆదేశాలు రాలేదని.. వస్తే అందరినీ అనుమతిస్తామని తెలిపారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఐదుగురు కంటే.. ఎక్కువ మంది మీడియా ప్రతినిధులు అనుమంతించడంలేదని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల ఫోన్లను లాక్కోవడం.. వారిని ఇళ్లలో బంధిస్తున్నారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తెలిపారు. Also read: Hathras Case: నిన్న రాహుల్ గాంధీ.. నేడు డెరిక్ ఓబ్రెయిన్.. అలాగే కిందపడేశారు!
Only media is allowed right now. When orders come in to allow delegations, we will let everybody know. All allegations about phones of the family members being taken away or confining them in their homes are absolutely baseless: Hathras Sadar SDM Prem Prakash Meena https://t.co/LE1mi6eZm8
— ANI UP (@ANINewsUP) October 3, 2020
సెప్టెంబరు 14న హత్రాస్‌లో ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి.. నాలుక కోసి చిత్రహింసలు పెట్టారు. దీంతో అప్పటినుంచి ఆమె చికిత్స పొందుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆ తర్వాత ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా.. అనుమంతించకుండా మంగళవారం అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యాచారాలను అరికట్టడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.